Advertisement

పవన్ ఫస్ట్ లుక్.. మోతెక్కిపోతున్న సోషల్ మీడియా

Posted : February 29, 2020 at 2:58 pm IST by ManaTeluguMovies

రెండేళ్ల గ్యాప్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నాడు. రాజకీయాల్లో బిజీ అయిపోయాడు. పైగా గ్యాప్ వచ్చింది. ఇలాంటి టైంలో పవన్ రీఎంట్రీ మీద జనాల్లో ఏమాత్రం ఆసక్తి ఉంటుందో.. మునుపటిలో పవన్‌ను ఆదరిస్తారా అని సందేహాలున్న వాళ్లకు సోషల్ మీడియాలో ఆయన క్రేజ్ చూసి పిచ్చెక్కిపోతుంది. అభిమానులకు అసలేమాత్రం రుచించని ‘పింక్’ రీమేక్‌లో పవన్ నటిస్తున్నా సరే.. నెటిజన్లలో ఆసక్తి మామూలుగా లేదు.

ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఏ రేంజిలో ఎదురు చూస్తున్నారో సోషల్ మీడియాలో హడావుడి చూస్తే అర్థమవుతోంది. షూటింగ్ స్పాట్లో కనిపించీ కనిపించని రెండు మూడు ఫొటోలు లీక్ అయితే.. వాటితోనే ఫస్ట్ లుక్ పోస్టర్లు డిజైన్ చేసి వైరల్ చేసేస్తున్నారు అభిమానులు. పవన్‌కు సంబంధించి ఏ హ్యాష్ ట్యాగ్ పెట్టినా సరే.. టాప్‌లో ట్రెండ్ అయిపోతోంది.

తాజాగా ‘పీఎస్పీకే 26 ఫస్ట్ లుక్’ పేరుతో హ్యాష్ ట్యాగ్ మీద పెద్ద డిస్కషన్ నడుస్తోంది. ఇది ఇండియా లెవెల్లో టాప్‌లో ట్రెండ్ అవుతుండటం విశేషం. మార్చి 2న ‘పింక్’ రీమేక్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తారని వార్తలు వస్తున్నాయి. దీనిపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది. ఈ లోపే అభిమానుల హంగామా మామూలుగా లేదు. దీనికి సంబంధించిన హ్యాష్ ట్యాగ్స్‌తో ట్విట్టర్‌ను మోతెక్కించేస్తున్నారు. ఫస్ట్ లుక్ వచ్చిన వారం లోపే ఫస్ట్ సింగిల్ కూడా వస్తోంది.

మార్చి 8న తొలి పాటను రిలీజ్ చేస్తారట. దీనికి సంబంధించిన హ్యాష్ ట్యాగ్ కూడా టాప్‌లో ట్రెండవుతోంది. ప్రస్తుతం సూపర్ ఫాంలో ఉన్న తమన్.. పవన్‌తో సినిమా అనేసరికి చాలా ఎగ్జైట్ అవుతున్నాడు. అతను అదిరిపోయే పాటలు ఇచ్చి ఉంటాడని.. తొలి పాటతో సర్ప్రైజ్ చేయడం ఖాయమని అభిమానులు అంచనా వేస్తున్నారు. మరి సోమవారం నిజంగానే పవన్ ఫస్ట్ లుక్ రిలీజైతే హంగామా ఎలా ఉంటుందో చూడాలి.


Advertisement

Recent Random Post:
Advertisement