Advertisement

‘పుష్ప-2’ను కొట్టిన ‘దేవర-1’

Posted : September 17, 2024 at 8:11 pm IST by ManaTeluguMovies

ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ‘దేవర-పార్ట్ 1’ ఒకటి. ఈ సినిమా మొదలైన దగ్గర్నుంచి అంచనాలు మామూలుగా లేవు. అంతకంతకూ ఆ అంచనాలు పెరుగుతూ వెళ్లాయి. ఐతే ఈ మధ్యే ఈ మూవీ ట్రైలర్ లాంచ్ చేయగా.. అది కొంచెం హైప్‌ను తగ్గించినట్లు అనిపించింది. ‘ఆచార్య’ సినిమాతో పోలికలు కనిపించడంతో పాటు ట్రైలర్లో హై మూమెంట్స్, కొత్తదనం కనిపించకపోవడంతో ప్రేక్షకులు ఒకింత నిరాశ చెందారు.

ఐతే రెండు మూడు రోజులు సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన నెగెటివిటీ కనిపించింది కానీ.. తర్వాత అంతా మామూలైపోయినట్లే కనిపిస్తోంది. ఇంకో పది రోజుల్లో సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో తారక్ ఫ్యాన్స్ ఈ సినిమా ఫీవర్‌తో ఊగిపోతున్నారు. సామాన్య ప్రేక్షకుల్లోనూ సినిమా పట్ల అమితాసక్తి కనిపిస్తోంది. ఈ క్రమంలోనే ‘బుక్ మై షో’లోనూ ‘దేవర’ ఓ రికార్డును అందుకుంది.

ఈ ఏడాది బుక్ మై షోలో అత్యధిక ఇంట్రెస్ట్స్ తెచ్చుకున్న సినిమాగా ‘దేవర’ రికార్డ్ నెలకొల్పింది. బీఎంఎస్‌లో ఏకంగా 3.44 లక్షల మంది లైక్ కొట్టి, ఈ సినిమా పట్ల ఆసక్తిని ప్రదర్శించారు. ఇప్పటిదాకా ‘పుష్ప-2’ ఈ ఏడాది అత్యధిక ఇంట్రెస్ట్స్ తెచ్చుకున్నే సినిమాగా కొనసాగుతూ వచ్చింది. దాని ఇంట్రెస్ట్స్ 3.34 లక్షల మేర ఉన్నాయి. ఈ మధ్య ‘పుష్ప-2’ టీం కూడా ఈ విషయాన్ని ఘనంగా ప్రకటించుకుంది. కానీ ఆ సినిమా విడుదలకు ఇంకా టైం ఉంది. ‘దేవర’ రిలీజ్ దగ్గర పడడంతో దానికి ఇంట్రెస్ట్స్ పెరిగిపోయి రికార్డును సొంతం చేసుకుంది.

రిలీజ్ టైంకి దీని లెక్క ఎంత ఉంటుందో కానీ.. ‘పుష్ప-2’ విడుదల సమయానికి ‘పుష్ప-2’ మళ్లీ రికార్డును సొంతం చేసుకునే అవకాశాలున్నాయి. ఆ సంగతలా ఉంచితే ‘దేవర’కు ఏపీ, తెలంగాణల్లో మిడ్ నైట్ షోలు పడబోతున్నాయి. తెలంగాణలో ఆల్రెడీ పర్మిషన్లు వచ్చేశాయి. ఏపీ సంగతి చూడాలి. అక్కడా ఆ షోలు ఖరారైతే యుఎస్ ప్రిమియర్స్‌తో పాటుగా ఇక్కడా ఒకేసారి షోలు మొదలవుతాయన్నమాట.


Advertisement

Recent Random Post:

Thalapathy Vijay Goodbye To Movies : సినిమాలకు విజయ్ గుడ్ బై! | Tamilaga Vettri Kazhagam Party

Posted : September 14, 2024 at 12:05 pm IST by ManaTeluguMovies

Thalapathy Vijay Goodbye To Movies : సినిమాలకు విజయ్ గుడ్ బై! | Tamilaga Vettri Kazhagam Party

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad