Advertisement

పూరి.. లైగర్ తలనొప్పి వదిలినట్లేనా?

Posted : July 26, 2024 at 6:06 pm IST by ManaTeluguMovies

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డబుల్ ఇస్మార్ట్ సినిమాలో త్వరలో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. కమర్షియల్ డైరెక్టర్ గా సుదీర్ఘకాలం టాలీవుడ్ లో తిరుగులేని ఇమేజ్ తో పూరి జగన్నాథ్ దూసుకుపోయారు. తక్కువ సమయంలో మూవీ షూటింగ్ కంప్లీట్ చేసి సినిమాని రిలీజ్ చేస్తాడనే పేరు పూరి జగన్నాథ్ కి ఉంది. అలాగే పూరి సినిమా అంటే వెంటనే ఆయన పవర్ ఫుల్ డైలాగ్స్ గుర్తుకొస్తాయి. హీరో క్యారెక్టరైజేషన్స్ మనసులో మెదులుతుంది

రోగ్ తరహా క్యారెక్టర్స్ లో కూడా హీరోయిజం చూపించడం పూరి స్టైల్. ఆయన కథలలో హీరోలు ఎప్పుడు స్ట్రైట్ ఫార్వార్డ్ గా ఉంటారు. అందుకే యూత్ కి పూరి జగన్నాథ్ ప్రెజెంట్ చేసిన హీరోయిజం బాగా కనెక్ట్ అయ్యింది. పోకిరి, బిజినెస్ మెన్, కెమెరామెన్ గంగతో రాంబాబు. ఇడియట్ ఇలా ఏ సినిమా చూసిన హీరో క్యారెక్టర్స్ ప్రత్యేకంగా ఉంటాయి. పూరి జగన్నాథ్ తో సినిమా చేస్తే మాస్ హీరో ఇమేజ్ వస్తుందనే అభిప్రాయం హీరోలకి ఉంది.

ఇప్పటికి పూరి జగన్నాథ్ మార్క్ ని బీట్ చేసే స్థాయిలో ఎవరు సినిమాలు చేయలేకపోయారు. అయితే పూరి జగన్నాథ్ చివరిగా లైగర్ సినిమాతో డిజాస్టర్ అందుకున్నారు. విజయ్ దేవరకొండ హీరోగా పాన్ ఇండియా లెవల్ లో లైగర్ మూవీ చేశారు. సినిమాపై విపరీతమైన హైప్ క్రియేట్ అయ్యింది. డిస్టిబ్యూటర్స్ మూవీ రైట్స్ ని భారీ ధరలకి కొనుగోలు చేశారు. అయితే రిలీజ్ తర్వాత లైగర్ డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది.

దీంతో లైగర్ తో నష్టపోయిన డిస్టిబ్యూటర్స్ రోడ్డుకెక్కారు. తమకి జరిగిన నష్టానికి పూరి జగన్నాథ్ సమాధానం చెప్పాలని వరంగల్ శ్రీనుతో పాటు మరికొంతమంది డిస్టిబ్యూటర్స్ ఫైట్ చేశారు. ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఆఫీస్ దగ్గర ధర్నా కూడా చేశారు. అయితే దీనిపై పూరి జగన్నాథ్ పెద్దగా రియాక్ట్ కాలేదు. ప్రస్తుతం పూరి జగన్నాథ్ డబుల్ ఇస్మార్ట్ మూవీ రిలీజ్ అవుతోంది. ఈ నేపథ్యంలో లైగర్ డిస్టిబ్యూటర్స్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ లో పంచాయితీ పెట్టారంట.

అందులో పూరి జగన్నాథ్ కి ఫెవర్ గా నిర్మాతల మండలి వివరణ ఇచ్చిందంట. నష్టాలు వచ్చినపుడు డిస్టిబ్యూటర్స్ కి తిరిగి డబ్బు చెల్లించాలని ఎలాంటి నియమాలు లేవని మండలి తేల్చి చెప్పిందంట. ఇవ్వడం, ఇవ్వకపోవడం అనేది పూరి జగన్నాథ్ ఇష్టం మీద ఆధారపడి ఉంటుందని తేల్చేసారంట. దీంతో నైజాంలో లైగర్ పంచాయితీ ముగిసిపోయినట్లే అని తెలుస్తోంది. ఇక ఏపీలో కూడా లైగర్ డిస్టిబ్యూటర్స్ తో ఉన్న పంచాయితీని పూరి జగన్నాథ్ సెటిల్ చేసుకుంటారని మండలి చెప్పిందంట. డబుల్ ఇస్మార్ట్ మూవీ రిలీజ్ రైట్స్ ని ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ కంప్లీట్ గా తీసుకుంది. దీంతో ఈ సినిమా టెన్షన్ పూరి జగన్నాథ్ కి లేదని తెలుస్తోంది.


Advertisement

Recent Random Post:

అమరావతికి రూ.15 వేల కోట్ల రుణం | Rs 15,000 Crore Loan to AP Capital Amaravati

Posted : November 12, 2024 at 1:41 pm IST by ManaTeluguMovies

అమరావతికి రూ.15 వేల కోట్ల రుణం | Rs 15,000 Crore Loan to AP Capital Amaravati

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad