Advertisement

ప్రభాస్ సినిమా ఆగిపోవడం వాళ్ళకు మంచిదే..

Posted : May 23, 2024 at 8:07 pm IST by ManaTeluguMovies

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన సలార్ మూవీ హిట్ టాక్ సొంతం చేసుకొని 700+ కోట్లకి పైగా కలెక్ట్ చేసింది. సలార్ కి సీక్వెల్ గా శౌర్యంగపర్వం ఉంటుందని ప్రశాంత్ నీల్ అప్పుడే క్లారిటీ ఇచ్చాడు. ఈ సినిమా కంప్లీట్ చేసిన తర్వాత ప్రశాంత్ నీల్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కి వెళ్తాడని అందరూ భావించారు. సలార్ షూటింగ్ జూన్ నుంచి మొదలవుతుందని టాక్ వచ్చింది.

అయితే ఇప్పుడు ఎందుకనో సడెన్ గా ప్రశాంత్ నీల్ ఈ నిర్ణయాన్ని మార్చుకున్నట్లు ప్రచారం నడుస్తోంది. ప్రశాంత్ నీల్ సలార్ 2 మూవీని వాయిదా వేసినట్లు తెలుస్తోంది. దీనికంటే ముందుగా ఎన్టీఆర్ తో చేయబోయే సినిమాని ముందుగా సెట్స్ పైకి తీసుకొని వెళ్లనున్నాడంట. ఎన్టీఆర్ బర్త్ డే రోజున మైత్రీ మూవీ మేకర్స్ ఈ కాంబినేషన్ మూవీ గురించి పోస్టర్ తో కన్ఫర్మేషన్ ఇచ్చింది. ఆగష్టు నుంచి ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అవుతుందని తెలిపారు.

అయితే సలార్ 2 మూవీ వాయిదా పడటం ఒక బడా నిర్మాణ సంస్థకు కూడా బాగా కలిసొచ్చింది. ఆ సంస్థ మరేదో కావు.. మైత్రీ మూవీ మేకర్స్. వీరికి చాలా ప్లస్ అయ్యిందనే మాట వినిపిస్తోంది. దీని కారణం మైత్రీ మూవీ మేకర్స్ లో ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ సినిమా షూటింగ్ స్టార్ట్ కాబోతోంది. అలాగే ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో మూవీ కూడా లైన్ లో ఉంది. ఈ సినిమాని కూడా వీలైనంత వేగంగా సెట్స్ పైకి తీసుకొని వెళ్లే ప్రయత్నంలో ఉన్నారు.

సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ మూవీని ఈ ఏడాది ఆఖరులో స్టార్ట్ చేసే ప్లానింగ్ లో ఉన్నారు. అంతకంటే ముందుగానే హను రాఘవపూడి దర్శకత్వంలో సినిమా మొదలవుతుందని టాక్ వినిపిస్తోంది. ఒక్క సలార్ వాయిదా పడటం వలన మైత్రీ మూవీ మేకర్స్ నుంచి రెండు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ సెట్స్ పైకి వెళ్ళబోతున్నాయి.

ఈ రెండు సినిమాలు భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నవే కావడం విశేషం. అయితే సలార్ 2 మూవీ షూటింగ్ వాయిదా పడలేదని, కచ్చితంగా జరుగుతుందనే మాట కూడా వినిపిస్తోంది. ప్రశాంత్ నీల్ నుంచి తారక్ సినిమా గురించి ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ రాలేదు. అతను సలార్ 2 కంప్లీట్ చేస్తూనే ఎన్టీఆర్ ప్రాజెక్టుని కూడా ఒకేసారి ఫినిష్ చేసేలా ప్లాన్ చేస్తాడని టాక్. మరి ఇందులో వాస్తవం ఎంత అనేది తెలియాల్సి ఉంది.


Advertisement

Recent Random Post:

రుషికొండ భవనంపై సుఖేష్ చంద్రశేఖర్ ఆసక్తి | Sukesh Chandrasekhar Letter to AP CM Chandrababu

Posted : June 21, 2024 at 10:12 pm IST by ManaTeluguMovies

రుషికొండ భవనంపై సుఖేష్ చంద్రశేఖర్ ఆసక్తి | Sukesh Chandrasekhar Letter to AP CM Chandrababu

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement