Advertisement

బాలయ్య గురించి ‘యానిమల్‌’ స్టార్‌ ఏమన్నాడంటే..!

Posted : August 20, 2024 at 7:03 pm IST by ManaTeluguMovies

నందమూరి బాలకృష్ణ బ్యాక్ టు బ్యాక్ మూడు సినిమాలతో సూపర్‌ హిట్ లు దక్కించుకుని హ్యాట్రిక్ నమోదు చేసిన విషయం తెల్సిందే. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ఓ భారీ చిత్రం తో రెడీ అవుతున్నాడు. ఎమ్మెల్యేగా మూడో సారి గెలిచిన నేపథ్యంలో బాలయ్య డబుల్‌ జోష్‌ తో ఉన్నాడు. ఆ జోష్ తో బాలయ్య చేస్తున్న ఈ సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు బాబీ అద్భుతంగా ఈ సినిమాను రూపొందిస్తున్నాడు అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులతో పాటు, సినిమా కోసం ఎదురు చూస్తున్న బాలయ్య ఫ్యాన్స్‌ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.

బాలయ్య సినిమా అంటే విలన్‌ అంతే పవర్‌ ఫుల్‌ గా ఉండాలి. బాలయ్య నటించే ప్రతి సినిమాలో కూడా విలన్స్ అత్యంత పవర్‌ ఫుల్‌ గా ఉండటం మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో కూడా బాలయ్య కు సరైన పోటీ ఇవ్వడానికి యానిమల్‌ లో విలన్‌ గా నటించి పాన్‌ ఇండియా స్టార్‌ గా నిలిచిన బాబీ డియోల్‌ ను ఎంపిక చేయడం జరిగింది. ఇటీవల బాలయ్య మరియు బాబీ కాంబో సన్నివేశాలను చిత్రీకరించడం జరిగిందని సమాచారం అందుతోంది. మరో వైపు బాబీ డియోల్‌ తమిళంలో చేసిన కంగువా సినిమా విడుదలకు సిద్దం అయ్యింది.

సూర్య హీరోగా శివ దర్శకత్వంలో రూపొందిన కంగువా సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా బాబీ డియోల్‌ మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. హీరో సూర్య తో నటించడం గొప్ప అనుభూతిని కలిగించిందని పేర్కొన్న ఆయన, బాలకృష్ణ తో కలిసి నటించడం చాలా బాగుందని అన్నాడు. బాలయ్య ను చాలా ఎనర్జిటిక్ స్టార్‌ గా బాబీ డియోల్‌ పేర్కొన్నాడు. షూటింగ్ ఎప్పుడు ప్రారంభం అయినా, ఎంత ఆలస్యం అయినా కూడా బాలకృష్ణ గారు ఫుల్‌ ఎనర్జీతో ఉంటారని, ఆయన ప్రతి ఒక్కరితో సరదాగా ఉంటారని బాబీ డియోల్‌ చెప్పుకొచ్చాడు.

ఒకప్పుడు హిందీలో స్టార్‌ హీరోగా వెలుగు వెలిగిన బాబీ డియోల్‌ ఒకానొక సమయంలో కెరీర్ ఖతం అయ్యింది, ఇక ఇంటికే పరిమితం అవ్వాలని అనుకున్నాడు. కానీ తెలుగు దర్శకుడు సందీప్ వంగ రూపొందించిన యానిమల్‌ సినిమా హిట్‌ అవ్వడంతో పాటు, అందులోని ఈయన పాత్ర సూపర్‌ హిట్ అవ్వడం వల్ల హిందీ, తెలుగు, తమిళం ఇలా అన్ని భాషల్లో కూడా వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ప్రతి ఒక్కరితో సన్నిహితంగా ఉండటం వల్ల ఎక్కువ ఆఫర్లు సొంతం చేసుకుంటున్నాడు. తెలుగు లో ఇంకా ఒక్క సినిమా కూడా విడుదల అవ్వకుండానే రెండు సినిమా ఛాన్సులు వచ్చాయట. అందులో ఒకటి ఎన్టీఆర్‌ వంటి పెద్ద హీరో తో అవ్వడం విశేషం.


Advertisement

Recent Random Post:

Stock Market Crash: Investors lose over Rs 3 lakh crore

Posted : October 1, 2024 at 12:40 pm IST by ManaTeluguMovies

Stock Market Crash: Investors lose over Rs 3 lakh crore

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad