Advertisement

బ్యాక్ టు బ్యాక్ మెగా ఛాన్స్‌ కొట్టాడు..!

Posted : May 22, 2024 at 7:32 pm IST by ManaTeluguMovies

పలాస సినిమాతో విమర్శకుల ప్రశంసలు దక్కించుకోవడంతో పాటు, కమర్షియల్‌ గా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న దర్శకుడు కరుణ కుమార్‌. మొదటి సినిమా పలాస విడుదల అయిన వెంటనే అల్లు అరవింద్‌ స్వయంగా పిలిచి మరీ ప్రశంసించి తన బ్యానర్ లో సినిమాను చేసేందుకు అడ్వాన్స్ ఇవ్వడం జరిగింది.

ఆ సమయంలో కరుణ కుమార్‌ గురించి ఇండస్ట్రీలో ప్రముఖంగా చర్చ జరిగింది. పలాస సినిమా తర్వాత ఓటీటీ ప్రాజెక్ట్‌ ను చేపట్టిన కరుణ కుమార్‌ మరో వైపు వరుసగా సినిమాలను కూడా రూపొందించాడు. ఆ మధ్య శ్రీదేవి సోడా సెంటర్‌ సినిమాను రూపొందించాడు. ఆ సినిమా కమర్షియల్ గా నిరాశ పరిచింది.

ప్రస్తుతం మెగా హీరో వరుణ్ తేజ్ తో కలిసి ‘మట్కా’ సినిమా ను చేస్తున్నాడు. మట్కా సినిమా పై కరుణ కుమార్ తో పాటు హీరో వరుణ్ తేజ్ కూడా చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఇద్దరికి కూడా ఈ సినిమా అత్యంత కీలకంగా మారింది. మట్కా తర్వాత కరుణ కుమార్‌ మరో సినిమా కూడా కన్ఫర్మ్‌ అయ్యింది.

ఆదికేశవ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న మెగా హీరో వైష్ణవ్‌ తేజ్ ఎన్నో కథలను విన్నాడట. ప్రముఖ దర్శకులు సైతం వైష్ణవ్‌ వద్దకు వెళ్లి కథ చెప్పారు అనే వార్తలు వచ్చాయి. కానీ అవేవి కూడా వైష్ణవ్‌ తేజ్‌ కి నచ్చలేదట. ఎట్టకేలకు కరుణ కుమార్‌ చెప్పిన కథ నచ్చడంతో ఓకే చెప్పాడని సమాచారం అందుతోంది.

కరుణ కుమార్‌ ప్రస్తుతం చేస్తున్న మట్కా సినిమా కనుక విజయాన్ని సొంతం చేసుకుంటే ఎలాంటి డౌట్‌ లేకుండా వైష్ణవ్‌ తేజ్ తో సినిమాను చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఒక దర్శకుడు ఒకేసారి ఇద్దరు మెగా హీరోలను బ్యాక్ టు బ్యాక్‌ డైరెక్ట్‌ చేసే అవకాశం రావడం అనేది చాలా అరుదైన విషయం.

ఈ మెగా హీరోలు ఇద్దరు కూడా సక్సెస్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో వీరికి కరుణ కుమార్‌ మంచి విజయాలను అందిస్తే మాత్రం కచ్చితంగా రాబోయే రోజుల్లో యంగ్‌ హీరోలకు దర్శకుడు కరుణ కుమార్‌ మోస్ట్‌ వాంటెడ్‌ అవ్వడం ఖాయం.


Advertisement

Recent Random Post:

అనగనగ ఓ బెంజ్ కారు..దాన్ని కొన్నారు ఓ మంత్రి గారు..పవర్ పోయినా.! l Ex Minister Roja l Off the Record

Posted : June 19, 2024 at 8:50 pm IST by ManaTeluguMovies

అనగనగ ఓ బెంజ్ కారు..దాన్ని కొన్నారు ఓ మంత్రి గారు..పవర్ పోయినా.! l Ex Minister Roja l Off the Record

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement