Advertisement

మన స్టార్ కి అంతర్జాతీయ వేదికపై అరుదైన ఘనత

Posted : December 7, 2022 at 5:33 pm IST by ManaTeluguMovies

బాలీవుడ్ హీరోలు మరియు హీరోయిన్స్ ఈ మధ్య కాలంలో అంతర్జాతీయ వేదికలపై తెగ సందడి చేస్తున్నారు. ముఖ్యంగా సినిమా వేడుకలు మరియు అవార్డు వేడుకలు జరుగుతున్న సమయంలో ఇండియన్ సినీ సెలబ్రెటీలకు కచ్చితంగా ఆహ్వానం దక్కుతుంది. ఆస్కార్ వంటి అత్యున్నత పురష్కారం యొక్క వేడుకలో కూడా ఇండియన్ సెలబ్రెటీలకు ఎంట్రీ లభిస్తుంది.

ఇలాంటి సమయంలో మరో అంతర్జాతీయ స్థాయి వేదికపై మన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే కు సందడి చేసే అవకాశం దక్కింది. ప్రపంచ మొత్తం ఎంతో ఆసక్తిగా చూస్తున్న ఫిఫా వరల్డ్ కప్ ట్రోఫీని ఆవిష్కరించే అవకాశం ఎంతో మంది హాలీవుడ్ ప్రముఖులకు గతంలో లభించింది. మొదటి సారి దీపికా కు ఈ ఛాన్స్ దక్కింది.

ఖతార్ లో జరుగుతున్న ఫిఫా ప్రపంచ కప్ ట్రోఫీ ని ఆవిష్కరించేందుకు రావాల్సిందిగా దీపికా కు ఆహ్వానం అందింది అంటూ సమాచారం అందుతోంది. అత్యంత రద్దీగా ఉండే ఖతార్ లోని అంతర్జాతీయ స్థాయి స్టేడియంలో ఈ ఆవిష్కరణ జరుగబోతున్నట్లుగా తెలుస్తోంది.

హీరోయిన్ గా ఇప్పటికే బాలీవుడ్ ను దాటి హాలీవుడ్ వరకు వెళ్లిన దీపికా పదుకొనే ఈ వేడుకలో సందడి చేయడం ద్వారా మరింతగా హాలీవుడ్ లో ప్రాచుర్యం పొందే అవకాశం ఉంది. ప్రస్తుతం సర్కస్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయిన దీపిక పదుకునే మరో వైపు ప్రభాస్ తో ప్రాజెక్ట్ కే సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే.


Advertisement

Recent Random Post:

AP Elections 2024 : జనం గుండె చప్పుళ్లే అజెండగా జగన్ మేనిఫెస్టో..! | YSRCP Manifesto 2024

Posted : April 26, 2024 at 11:41 am IST by ManaTeluguMovies

AP Elections 2024 : జనం గుండె చప్పుళ్లే అజెండగా జగన్ మేనిఫెస్టో..! | YSRCP Manifesto 2024

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement