Advertisement

మహేష్ పై గ్యాసిప్ లు పుట్టిస్తున్నారా?

Posted : March 17, 2020 at 7:46 pm IST by ManaTeluguMovies

సూపర్ స్టార్ మహేష్ ను సైకలాజికల్ గా టార్గెట్ చేస్తున్నారా? మహేష్ కు డైరక్టర్లు లేరని, డైరక్టర్ల కోసం కిందా మీదా అయిపోతున్నారని, ఎవరికి పడితే వారికి మహేష్ కబురు చేస్తున్నారని వార్తలు పుట్టిస్తున్నారా? మహేష్ సన్నిహిత వర్గాలు, ఫ్యాన్స్ నుంచి ఇదే వినిపిస్తోంది.

మహేష్ నుంచి భీష్మ దర్శకుడు వెంకీ కుడుమలకు పిలుపు వచ్చిందన్న వార్త గుప్పుమంది. అంతకు ముందు ప్రవీణ్ సత్తారు పేరు కూడా వినిపించింది. అయితే ఇవన్నీ చాలా ప్లాన్డ్ గా మీడియాలోకి ఇంజెక్ట్ చేస్తున్నారని, దీనివల్ల మహేష్ కు పెద్ద దర్శకులు దొరకడం లేదు, చిన్న డైరక్టర్లకు సైతం కబురు చేస్తున్నాడు అనే విధమైన వార్తలు వెళ్లేలా చేస్తున్నారని ఆయన సన్నిహత వర్గాలు, ఫ్యాన్స్ నుంచి తెలుస్తోంది.

నిజానికి పరుశురామ్ కు ఆప్షన్ ఇచ్చాక, మహేష్ మరే ఆలోచనలు లేకుండా వున్నారని, అమెరికాలో సర్జరీకి వెళ్లాల్సి వుందని, అయితే కరోనా కారణంగా వాయిదా పడిందని తెలుస్తోంది. ఈ లోగా సైలంట్ గా డార్జిలింగ్ లాంటి శీతల ప్రాంతానికి వెళ్లిపోయారని అంటున్నారు.

పరుశురామ్-14రీల్స్-మైత్రీ తకరారు తెగితే మహేష్ మళ్లీ సిన్మా స్టార్ట్ చేస్తారని, అంతవరకు మరే ప్లాన్ లేదని తెలుస్తోంది.


Advertisement

Recent Random Post:

AP Elections 2024 || ఆ నియోజకవర్గాలలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల మార్పు..| Chandrababu Naidu

Posted : April 21, 2024 at 7:34 pm IST by ManaTeluguMovies

AP Elections 2024 || ఆ నియోజకవర్గాలలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల మార్పు..| Chandrababu Naidu

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement