Advertisement

ముంబైలో చ‌ర‌ణ్ స్టూడియో పెడుతున్నాడా?

Posted : December 23, 2023 at 7:01 pm IST by ManaTeluguMovies

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ నేడు గ్లోబ‌ల్ స్టార్. ఆర్ ఆర్ ఆర్ విజ‌యంతో అత‌ని స్థాయి రెట్టింపు అయింది. హాలీవుడ్..బాలీవుడ్ లోనూ అవ‌కాశాలు వ‌స్తున్నాయి. కానీ మాతృభాష త‌ర్వాతే ఏ భాష అయినా అని న‌టుడిగా ఇక్క‌డ నుంచి కొన‌సాగుతున్నారు. ఇక చ‌ర‌ణ్ వ్యాపార రంగంలోనూ రాణిస్తోన్న సంగ‌తి తెలిసిందే. సొంతంగా కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీని మొద‌లు పెట్టి ఆ సంస్థ‌లో భారీ బ‌డ్జెట్ సినిమాలు నిర్మిస్తున్నారు.

ముంబైలో హాలీవుడ్ రేంజ్లో ఓ స్టూడియో నిర్మాణం చేప‌ట్టాల‌ని చ‌ర‌ణ్‌-ఉపాస‌న‌లు ప్లాన్ చేస్తున్న‌ట్లు అభిమానుల్లో డిస్క‌ష‌న్ సాగుతోంది . అత్యాధునిక టెక్నాల‌జీతో ఈ స్టూడియో నిర్మాణం చేప‌ట్టాల‌ని ప్లాన్ చేస్తున్నారుట‌. నిన్న‌టి రోజున చ‌ర‌ణ్‌-ఉపాస‌న దంప‌తులు మ‌హ‌రాష్ట్ర సీఎం ఏక్ నాధ్ షిండేతో భేటి అయిన సంగ‌తి తెలిసిందే. తొలుత ఇది మ‌ర్యాద‌పూర్వ‌క భేటి అని ప్ర‌చారం సాగిన ఈ భేటి వెనుక బిజినెస్ ప్లాన్ ఉంద‌నే అంశం అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారుతోంది.

స్టూడియో నిర్మాణానికి సంబంధించి ప్ర‌భుత్వం నుంచి అన్ని ర‌కాల అనుమ‌తులు వ‌చ్చేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ముఖ్య‌మంత్రిని కోరిన‌ట్లు అభిమానుల్లో చ‌ర్చ‌కొస్తుంది. ఈ స్టూడియో నిర్మాణం ఐడియా మెగా ఫ్యామిలీలో ఓ కీల‌క వ్య‌క్తిద‌ని ఇన్ సైడ్ టాక్ వినిపిస్తుంది. ఆ కోరిక మేర‌కే చ‌ర‌ణ్ అక్క‌డ ప్లాన్ చేస్తున్నట్లు ప్ర‌చారం సాగుతోంది. అలాగే ముంబైతో పాటు సైమ‌ల్టేనియ‌స్ గా రాజ‌ధాని న‌గ‌రంగా అభివృద్ది చెందుతోన్న వైజాగ్ లోని రుషి కొండ‌ని అనుకున్న ఉన్న సాగ‌ర తీరంలోనూ స్టూడియో ఏర్పాటు చేయాల‌ని చ‌ర‌ణ్ ప్లాన్ చేస్తున్నర‌ని ఎప్ప‌టి నుంచో ప్ర‌చారంలో ఉండ‌నే ఉంది. ఇప్పుడా ఆలోచ‌న వైపు కూడా సీరియ‌స్ గా క‌స‌రత్తులు మొద‌ల‌య్యాయని మెగా అభిమానుల్లో చ‌ర్చ‌కు దారి తీస్తుంది. మ‌రి ఈ ప్ర‌చారంలో నిజ‌మెంతో తెలియాల్సి ఉంది.

Advertisement

Recent Random Post:

Suma Adda Latest Promo – 27th April 2024 – Suhas,Rashi, Bhadram,Saranya Pradeep

Posted : April 25, 2024 at 5:34 pm IST by ManaTeluguMovies

Suma Adda Latest Promo – 27th April 2024 – Suhas,Rashi, Bhadram,Saranya Pradeep

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement