Advertisement

మూడు వారాలు రాజ‌మండ్రిలో సూర్య యాక్ష‌న్!

Posted : August 16, 2023 at 8:08 pm IST by ManaTeluguMovies

కోలీవుడ్ స్టార్ సూర్య క‌థానాయ‌కుడిగా శివ ద‌ర్శ‌క‌త్వంలో భారీ పిరియాడిక్ చిత్రం ‘కంగువ’ తెర‌కెక్కు తోన్న సంగ‌తి తెలిసిందే. పీరియాడిక్ యాక్ష‌న్ డ్రామ‌గా తెర‌కెక్కుతోన్న సినిమాలో సూర్య కొత్త లుక్ ఇప్ప‌టికే కాక పుట్టిస్తుంది. రిలీజ్ అయిన ప్ర‌చార చిత్రాలు సినిమాపై అంకంత‌కు అంచ‌నాలు పెంచేస్తున్నాయి. సాహ‌సోపేతమైన ఇన్నోవేటివ్ స్టోరీలు ప‌డితే సూర్య చెల‌రేగిపోతాడ‌ని మ‌రోసారి ప్రూవ్ అవుతుంది.

‘కంగువా’ కోసం అలాగే ప‌నిచేస్తున్నాడు. ఇప్ప‌టికే కొద్ది భాగం షూటింగ్ పూర్త‌యింది. దీనిలో భాగంగా చెన్నై..హైద‌రాబాద్ లోనే షూటింగ్ చేసారు. తాజాగా కొత్త షెడ్యూల్ రాజ‌మండ్రిలో ఈరోజు ఉద‌య‌మే ప్రారంభ‌మైంది. మూడు వారాల పాటు ఇక్క‌డే షూటింగ్ జ‌రుగుతుంది. కీల‌క‌మైన యాక్ష‌న్ స‌న్నివేశాల‌తో పాటు..కొంత టాకీ పార్టు ఇక్క‌డ పూర్తిచేయ‌నున్నారు. చిత్రీక‌ర‌ణ లో సూర్య ప్ర‌ధాన న‌టులంతా పాల్గొంటు న్నారు.

ఈ షూట్ లో జ‌గ‌ప‌తి బాబు కూడా పాల్గొంటున్నారు. ఇందులో ఆయ‌న ఓ కీల‌క పాత్ర పోషిస్తున్నారు. ఈ షెడ్యూల్ పూర్త‌యిన త‌ర్వాత త‌దుప‌రి షెడ్యూల్ హైద‌రాబాద్ లోనే ప్రారంభం కానుంది. ఇక్క‌డ మ‌రికొన్ని కీల‌క‌మైన స‌న్నివేశాలు చిత్రీక‌రించ‌నున్నారు. దీనిలో భాగంగా రామోజీ ఫిలింసిటీలో ప్ర‌త్యేకంగా సెట్లు నిర్మిస్తున్న‌ట్లు స‌మాచారం. చిత్రీక‌ర‌ణ కోస‌మే యూనిట్ చాలా స‌మ‌యం కేటాయిస్తుంది. షూట్ ప్రారంభానికి ముందు ప్ర‌త్యేకంగా వ‌ర్క్ షాప్ లు కూడా నిర్వ‌హించారు. ప్ర‌ధాన పాత్ర‌ధారులంతా అందులో పాల్గొన్నారు.

సూర్య కెరీర్ లో భారీ బ‌డ్జెట్ చిత్రంగా తెర‌కెక్కుతోంది. యాక్ష‌న్ స‌న్నివేశాలు నెక్స్ట్ లెవ‌ల్ ఉండ‌బోతున్నాయ‌ని తెలుస్తోంది. అన్ని ప‌నులు పూర్తి చేసి వ‌చ్చేడాది ఉగాది కానుక‌గా చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు. మొత్తం ప‌ది భాష‌ల్లో రిలీజ్ అవుతుంది. ఇందులో సూర్య‌కి జోడీతా బాలీవుడ్ నటి దిశా పటానీ నటిస్తోంది. స్టూడియో గ్రీన్ – యువి క్రియేషన్స్ బ్యానర్లు ప్రతిష్టాత్మకంగా చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.


Advertisement

Recent Random Post:

Iran – Israel War | ఇజ్రాయెల్ పై ఇరాన్ ప్రతీకార దాడి.. | యుద్ధం తప్పదా..?

Posted : October 2, 2024 at 7:54 pm IST by ManaTeluguMovies

Iran – Israel War | ఇజ్రాయెల్ పై ఇరాన్ ప్రతీకార దాడి.. | యుద్ధం తప్పదా..?

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad