Advertisement

మెగాపవర్ స్టార్- ఐకాన్ స్టార్ దీపావళి సంబరాలు

Posted : November 4, 2021 at 4:06 pm IST by ManaTeluguMovies


ఏ పండుగ వచ్చినా మెగా ఫ్యామిలీ అంతా ఒకేచోట హాజరై సెలబ్రేట్ చేసుకుంటారు. ముఖ్యంగా దసరా..సంక్రాంతి.. దీపావళి లాంటి పండుగల్ని కుటుంబమంతా కలిసి తప్పక జరుపుకుంటారు. మెగాస్టార్ చిరంజీవి సారథ్యంలో అంతా ఒకేచోట వేడుకగా హాజరై ఘనంగా జరుపుకుంటారు. కనుమరుగైపోతున్న ఉమ్మడి కుటుంబ వ్యవస్థని ఈ రకంగానైనా అప్పుడప్పుడు గుర్తు చేసుకునే అలవాటు కొణిదెల ఫ్యామిలీకి ఉంది. చిరంజీవి అక్కాచెల్లెళ్లు..మేనల్లుళ్లు..తమ్ముళ్లు అంతా ఒకేచోట కలిసి ఆ కొన్ని ఘడియలు సరదాగా గడుపుతారు. ఇక సంక్రాంతి పండుగకు తప్పనిసరిగా బెంగళూరు ఫామ్ హౌస్ లో ఎంతో ఘనంగా జరుపుకుంటారు. అరుదుగా మిస్సయినా మెగా అల్లు ఫ్యామిలీస్ బెంగళూరు ఫామ్ హౌస్ కి వెళ్లే సంప్రదాయాన్ని కొనసాగించారు.

పండుగ మూడు రోజులు అక్కడే ఫామ్ హౌస్ లో సరదాగా గడిపి వస్తారు. అక్కడే సంక్రాంతి పిండి వంటలన్ని స్వయంగా తయారు చేసుకోవడం ఒక అలవాటు. నేడు గురువారం దీపావళి సందర్భంగా మరోసారి అన్ని కుటుంబాలు కలిసి వేడుకలు జరుపుకుంటున్నారని తెలుస్తోంది. కుటుంబ సభ్యులంతా కలిసి దిగిన ఓ ఫ్యామిలీ ఫోటోని అభిమానులకు షేర్ చేసారు మెగా హీరోలు. ఇందులో రామ్ చరణ్..అల్లు అర్జున్ బ్లాక్ డ్రెస్ లో స్టైలిష్ గా ఫోజులిచ్చారు. ఇంకా ఉపాసన…స్నేహారెడ్డి.. నిహారిక..సుస్మిత.. శ్రీజ… అల్లు బాబి..చైతన్య.. విష్ణు ప్రసాద్… వైష్ణవ్ తేజ్ ఈ గ్రూప్ లో ఉన్నారు.

అయితే ఈ ఫోటోలో వరుణ్ తేజ్..సాయితేజ్.. కళ్యాణ్ దేవ్..శిరీష్ ఎక్కడా కనిపించలేదు. ఆ ముగ్గురు మిస్ అయ్యారు. సాయితేజ్ యాక్సిడెంట్ కారణంగా విశ్రాంతిలో ఉన్నారు. మిగతా వారంతా తమ వ్యక్తిగత పనుల్లో బిజీ అయినట్లు తెలుస్తోంది. కేవలం మెగా ఫ్యామిలీ నుంచి వారసులు మాత్రమే ఈ గ్రూప్ స్టిల్ ని షేర్ చేసుకున్నారు. పెద్దవాళ్లు ఎవరూ ఈ ఫోటోలో కనిపించలేదు. నేటి సాయంత్రం మరిన్ని గ్రూప్ ఫోటోల బంచ్ లు విడుదలవుతాయని మెగా ఫ్యాన్స్ భావిస్తున్నారు. చిరంజీవి..నాగబాబు..అరవింద్..పవన్ కళ్యాణ్ తదితరులు ఈరోజు రాత్రికి సెలబ్రేషన్స్ లో ఉంటారని గుసగుసలు వినిపిస్తున్నాయి


Advertisement

Recent Random Post:

ఐటీ ఉద్యోగులతో నారా బ్రాహ్మణి సమావేశం | Nara Brahmani Meet IT Employees | Mangalagiri

Posted : May 1, 2024 at 5:52 pm IST by ManaTeluguMovies

ఐటీ ఉద్యోగులతో నారా బ్రాహ్మణి సమావేశం | Nara Brahmani Meet IT Employees | Mangalagiri

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement