Advertisement

ర‌జ‌నీ ‘జైలర్ 2’ పై నెల్స‌న్ అప్‌డేట్

Posted : March 12, 2024 at 6:33 pm IST by ManaTeluguMovies

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ 73 వ‌య‌సులో వ‌రుస చిత్రాల‌తో బిజీగా ఉండ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. ఆయ‌న న‌టించిన జైల‌ర్ 2023లో సంచ‌ల‌న విజ‌యం సాధించింది. ఇటీవ‌ల లాల్ స‌లాం ఫెయిలైనా ఆ క్రెడిట్ ర‌జ‌నీకి ద‌క్క‌దు. త‌దుప‌రి అత‌డు లోకేష్ క‌న‌గ‌రాజ్, జైభీమ్ ద‌ర్శ‌కుడితోను ప‌ని చేస్తున్నాడు. ఇంత‌లోనే జైల‌ర్ సీక్వెల్ కోసం నెల్స‌న్ తో క‌లిసి ప‌ని చేస్తార‌ని క‌థ‌నాలొచ్చాయి.

జైలర్ సీక్వెల్‌పై దర్శకుడు నెల్సన్ ని ప్ర‌శ్నించ‌గా, అత‌డు దీనిపై క్లారిటీనిచ్చారు. సూపర్ స్టార్ రజనీకాంత్ – నెల్సన్ దిలీప్ కాంబినేష‌న్ లో జైలర్ బాక్సాఫీస్ రికార్డుల ప‌రంగా సంచల‌నం సృష్టించింది. ఏ విధంగానూ ఇది పరిపూర్ణ చిత్రం కానప్పటికీ అభిమానులు రజనీకాంత్‌ను ఎలా చూడాలనుకుంటున్నారో సరిగ్గా అలా చూపించ‌డంలో నెల్స‌న్ సక్సెసయ్యాడు. జైలర్ ఆల్ టైమ్ అత్యధిక వసూళ్లు చేసిన తమిళ సినిమాలలో ఒకటిగా నిలిచింది. ద‌ళ‌పతి విజయ్ లియో తర్వాత జైల‌ర్ రికార్డుల్లో నిలిచింది.

అప్పటి నుండి అభిమానులు సినీ ప్రేమికులు ‘జైలర్‌’కి సీక్వెల్ ఉంటుందా? అని అడుగుతున్నారు. చాలా కాలం క్రితం జైలర్ 2 కోసం నెల్సన్‌-రజ‌నీ క‌లుస్తున్నార‌ని పుకార్లు వచ్చాయి. అయితే ఇటీవలి మీడియా ఈవెంట్‌లో దర్శకుడు నెల్సన్ తన తదుప‌రి ప్రాజెక్ట్‌ల గురించి కొన్ని ప్రశ్నలు అడిగారు. భవిష్యత్తులో జైలర్ 2ని ఆశించవచ్చా? అని అడిగినప్పుడు నెల్సన్ బదులిస్తూ.. ప్రస్తుతం ఇది తదుపరి ప్రాజెక్ట్ అవుతుందా లేదా అనేది ఇంకా నాకు తెలియదు… ప్రకటన కోసం వేచి ఉండండి.. అని అన్నారు. తన త‌దుప‌రి ప్రాజెక్ట్‌ల గురించి హోస్ట్ ప్ర‌శ్నించ‌గా.. నెల్సన్ ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని, రెండు నెలల్లో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని బదులిచ్చారు.

జైలర్ నుండి తనకు ఇష్టమైన షాట్ గురించి మాట్లాడుతూ.. క్లైమాక్స్‌లో స్మోకింగ్ షాట్ తనకు ఇష్టమైన సన్నివేశమని నెల్స‌న్ వెల్లడించాడు. రజనీకాంత్ సార్ అనవసరంగా ధూమపానం చేయకూడదని చెప్పారు. కాని తరువాత ఆయ‌న‌ దానిని ఒక సీక్వెన్స్‌గా ఊహించారు.. ఇది చాలా ఎక్కువ థియేట్రికల్ మూమెంట్ అవుతుందని మేమంతా అంగీకరించాం అని చెప్పాడు. ఈ షాట్ రజనీకాంత్ మునుపటి చిత్రాలైన బాషా – అన్నామలై నుండి ప్రేరణ పొందిందని ఆ ఐకానిక్ సన్నివేశాలకు కొంత న్యాయం చేయడానికి ప్రయత్నించానని చెప్పాడు.

రజనీకాంత్ వ‌రుస‌ ప్రాజెక్ట్‌లు

ఈ ఏడాది ర‌జ‌నీ వ‌రుస చిత్రాల‌తో బిజీ కానున్నారు. ప్రస్తుతం జై భీమ్ దర్శకుడు T.J జ్ఞానవేల్‌తో తన తదుపరి చిత్రం వేట్టైయన్ షూటింగ్‌లో ఉన్నారు. ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. 2024లో విడుదల చేయాలని భావిస్తున్నారు. వేట్టైయన్‌లో ఫహద్ ఫాసిల్, రానా దగ్గుబాటి, అమితాబ్ బచ్చన్ త‌దితరులు కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అంతే కాకుండా రజనీకాంత్ దర్శకుడు లోకేష్ కనగరాజ్‌తో తాత్కాలికంగా తలైవర్ 171 అనే చిత్రానికి సంతకం చేశారు. దీని షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఊహాగానాలు నిజమైతే ‘జైలర్ 2’ చేయ‌డానికి ఆస్కారం ఉంది. జ్ఞాన‌వేల్ టిజే, లోకేష్ కన‌గ‌రాజ్ చిత్రాల త‌ర్వాత నెల్స‌న్ కి ఛాన్సుంటుందని భావిస్తున్నారు.


Advertisement

Recent Random Post:

LIVE – కొండా సురేఖ కామెంట్స్ పై నాగార్జున వార్నింగ్ ట్వీట్ |Nagarjuna Warning Tweet To Konda Surekha

Posted : October 2, 2024 at 8:19 pm IST by ManaTeluguMovies

LIVE – కొండా సురేఖ కామెంట్స్ పై నాగార్జున వార్నింగ్ ట్వీట్ |Nagarjuna Warning Tweet To Konda Surekha

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad