సంక్రాంతికి మహేష్ బాబు **గుంటూరు కారం** సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద సరైన సక్సెస్‌ను అందుకోలేకపోయింది. ఇక మహేష్ నెక్స్ట్ రాజమౌళి సినిమా కోసం సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తప్పకుండా సినిమా హాలీవుడ్ రేంజ్‌లో ఉంటుంది అని ఇప్పటికే కొన్ని గాసిప్స్ ద్వారా క్లారిటీ వచ్చేసింది.
ఆఫ్రికా అడవుల నేపథ్యంలో ఉండబోయే ఆ సినిమాలో మహేష్ పవర్ఫుల్ హీరోగా కనిపిస్తాడట. ఇక సినిమా ఎప్పుడు మొదలవుతుందో కానీ తెరపైకి వచ్చేసరికి మూడేళ్ల సమయం పడుతుంది అని చెప్పవచ్చు. అసలే వెయ్యి కోట్లకు పైగా బడ్జెట్ అంటున్నారు. రాజమౌళి సాధారణంగా 200 కోట్లు, 300 కోట్లు బడ్జెట్ అంటేనే రెండేళ్ల సమయం తీసుకుంటాడు. ఇక లెక్క వెయ్యి కోట్లు దాటుతోంది అంటే నాలుగేళ్ల సమయం పట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.
ఇక ఆ సినిమా కోసం మహేష్ గట్టిగానే ప్రిపేర్ అవుతున్నాడు. ఫిట్‌నెస్ విషయంలో కూడా చాలా మార్పులు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఆ ప్రాజెక్ట్ కంటే ముందు మహేష్ బాక్సాఫీస్ వద్ద ఒక బలమైన పోటీని ఎదుర్కోబోతున్నాడు. డిస్నీ వరల్డ్ నిర్మించిన హాలీవుడ్ మూవీ ముఫాసా: ది లయన్ కింగ్* అనే సినిమాలో మహేష్ తన వాయిస్‌ను వినిపించబోతున్న విషయం తెలిసిందే.
ముఫాసా పాత్రకు మహేష్ వర్క్ చేస్తూ ఉండడంతో ఇండియా మొత్తం కూడా ఈ విషయం హాట్ టాపిక్‌గా మారిపోయింది. మరోవైపు బాలీవుడ్‌లో హిందీ భాషలో షారుక్ ఖాన్‌తో పాటు ఆయన ఇద్దరు కుమారులు కూడా ఈ సినిమాలోని పాత్రలకు వారి వాయిస్‌ను అందించబోతున్నారు. ఇక షారుక్ ఖాన్ వర్సెస్ మహేష్ బాబు అనేలా బాక్సాఫీస్ దగ్గర కొంత పోటీ అయితే కనిపిస్తుంది అని చెప్పవచ్చు.
ఇక తెలుగు కలెక్షన్స్ హిందీ భాషను డామినేట్ చేసే విధంగా ఉంటాయా లేదా అనేది చూడాలి. ఏదేమైనా మహేష్ వాయిస్ ఇస్తున్నాడు కాబట్టి తెలుగులో మంచి బజ్ ఏర్పడింది. దీంతో ఓపెనింగ్స్‌తోనే బాక్సాఫీస్ వద్ద ఇంపాక్ట్ కనిపించే అవకాశం ఉంది. ఇక షారుక్ ఖాన్ ఇందులో వాయిస్ ఓవర్ ఇస్తున్నాడు కాబట్టి హిందీ వెర్షన్ హైదరాబాద్‌లో కూడా హడావుడి చేయనుంది. అలాగే తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లోనూ అక్కడి స్టార్స్‌తో సినిమాకి బజ్ తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
ఇక మహేష్ కారణంగా ముఫాసా తెలుగు కలెక్షన్లు మిగతా భాషల కంటే ఎంత ఎక్కువగా ఉంటాయో చూడాలి. ఇక రాజమౌళి సినిమా కంటే ముందు ఈ సినిమాతోనే మహేష్ బాబుకు చివరి పోటీ అని చెప్పాలి. మళ్ళీ మరో మూడేళ్ల వరకు థియేటర్ లో కనిపించడు, వినిపించడు. ఇక గుంటూరు కారంతో పెద్దగా సక్సెస్ రాలేదు. కావున హాలీవుడ్ సినిమాను తెలుగులో ఎంతవరకు సక్సెస్ అయ్యేలా చేస్తాడో చూడాలి.