మొన్నటి వరకూ నటసింహ బాలకృష్ణ ఎన్నికల ప్రచారం..హిందూపురం ఎన్నిక పనుల్లో క్షణం తీరిక లేకుండా గడిపారు. దాదాపు ఆరు నెలలుగా బాలయ్య జనాల మధ్యనే తిరిగారు. తనదైన శైలి పొలిటికల్ స్పీచ్ లతో బాలయ్య దంచి కొట్టారు. ఈ ఆరు నెలలు అభిమానులకు పండగలాగే అనిపించింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు నియోజక వర్గాలు బాలయ్య పర్యటించడంతో ఆయా చోట్ల ఘన స్వాగతం లభించింది. రాజకీయ నాయకుడిగా కంటే సినీ గ్లామర్ ప్రభావం ఎలా ఉంటుందో? మరోసారి చూపించారు. ఇప్పుడవన్నీముగించారు.
దీంతో మళ్లీ ప్రెష్ మైండ్ తో షూటింగ్ లో పాల్గొనాలి. ఎన్నికల ఫలితాలు జూన్ 4న వస్తున్నా? బాలయ్య వాటితో పనిలేకుండా షూట్ కి హాజరవుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం బాలకృష్ణ 109వ సినిమాని బాబి తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ‘అఖండ’ .. ‘వీరసింహా రెడ్డి’ ..’భగవంత్ కేసరి’ సినిమాలతో మంచి ఊపు మీద ఉన్నాడు. వరుసగా మూడు సినిమాల విజయంతో హ్యాట్రిక్ నమెదు చేసారు. దీంతో డబుల్ హ్యాట్రిక్ కోసం ట్రై చేస్తున్నారు. 109 తో కూడా హిట్ కొట్టాలని కసి మీద ఉన్నారు.
మళ్లీ పార్టీ అధికారంలోకి వస్తుంది అన్న ఉత్సాహం బాలయ్యలో కనిపిస్తుంది. ఈ ఉత్సాహానికి హిట్ కూడా తోడైతే అది వేరే లెవల్ లో ఉంటుంది. వచ్చేవారంలోగానీ .. ఆ పై వారంలోగాని కొత్త షెడ్యూల్ ప్రారంభించాలని యూనిట్ ప్లాన్ చేస్తోందిట. ఇది యాక్షన్ తో మొదలు కానుందని సమాచారం. అంటే బాలయ్య రియల్ వార్ ముగించి..రీల్ వార్ కి రెడీ అవుతున్నట్లు లెక్క. ఇందులో బాలయ్యపై ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ ను షూట్ చేయనున్నారట.
ఇంత రిస్కీ ఫైట్ ను బాలయ్య ఇంతవరకూ చేయలేదని సమాచారం. అభిమానుల్లో పూనకం తెప్పించేలాగే ఈ ఫైట్ డిజైన్ చేసినట్లు చిత్ర వర్గాల నుంచి లీకులందుతున్నాయి. అంటే బాలయ్య ఢీకొట్టేది ప్రతినాయకుడు బాబీ డియోల్ నే అని చెప్పొచ్చు. ఇందులో బాలయ్యకి జోడీగా ఇద్దరు..ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నట్లు ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. బాలయ్య అంటే ఆ మాత్రం ఉండాల్సిందే మరి.