Advertisement

రీల్‌ పుష్పకి రియల్‌ పుష్ప ఏం పంపాడో తెలుసా..!

Posted : October 27, 2023 at 7:30 pm IST by ManaTeluguMovies

అల్లు అర్జున్‌, సుకుమార్‌ కాంబోలో వచ్చిన పుష్ప సినిమా ఎంతటి విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పెద్దగా అంచనాలు లేకుండా పాన్ ఇండియా రేంజ్ లో విడుదల అయిన పుష్ప సినిమా కేవలం ఉత్తర భారతం లో వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించి సంచలనం సృష్టించింది. సినిమా విజయంలో పాటలు వైరల్ అవ్వడం కీలకం అనడంలో సందేహం లేదు.

పుష్ప పాటలు జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా వైరల్‌ అయ్యాయి. ఎంతో మంది వరల్డ్‌ ఫేమస్ సెలబ్రిటీలు పుష్ప సాంగ్స్ ను సోషల్‌ మీడియా ద్వారా వైరల్‌ చేశారు. కేవలం పాటలు మాత్రమే కాకుండా నీ అవ్వ తగ్గేదే లే అంటూ వరల్డ్‌ ఫేమస్ సెలబ్రెటీలు చేసిన రీల్స్ ఓ రేంజ్ లో ప్రపంచాన్ని చుట్టేశాయి. అందుకే పుష్ప కి ఆ రేంజ్ విజయం దక్కింది.
పుష్ప పాటలు మరియు డైలాగ్స్ వైరల్‌ అవ్వడం లో ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ పాత్ర కూడా ఉంది అనడంలో సందేహం లేదు. ఆయన పుష్ప డైలాగ్స్‌ ను మరియు పాటలను ఎన్ని వర్షన్ లలో చేశాడో మనం చూశాం. అందుకే అందుకే డేవిడ్ వార్నర్‌ ని రీల్‌ పుష్ప అంటారు. మార్ఫింగ్‌ చేసిన వీడియో వార్నర్‌ కి భారీగా సోషల్‌ మీడియా ఫాలోవర్స్ ని కూడా తెచ్చి పెట్టింది అనేది టాక్‌.

నేడు డేవిడ్ వార్నర్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా రియల్‌ పుష్ప నుంచి రీల్‌ పుష్ప కు పుట్టిన రోజు శుభాకాంక్షలు అందాయి. ఇన్ స్టాగ్రామ్‌ ద్వారా అల్లు అర్జున్‌ బర్త్‌ డే విషెష్ ను చేప్పడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించాడు. డేవిడ్ వార్నర్‌ ఫోటోను షేర్ చేయడంతో పాటు ఆయన కు మరిన్ని విజయాలు దక్కాలంటూ ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు.

ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ కప్‌ లో కూడా డేవిడ్ వార్నర్ ఉత్తమ ప్రదర్శణ కనబర్చిన ప్రతి సారి కూడా అల్లు అర్జున్ మాదిరిగా నీ అవ్వ తగ్గేదే లే అంటూ గడ్డం కింద చేయి పెట్టుకుని తన విజయానందం ను అభిమానులతో పంచుకుంటున్నాడు.


Advertisement

Recent Random Post:

Gorre Puranam – Official Trailer | Suhas | Pawan Ch

Posted : September 16, 2024 at 7:53 pm IST by ManaTeluguMovies

Gorre Puranam – Official Trailer | Suhas | Pawan Ch

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad