Advertisement

వ‌ర‌ద‌లో చిక్కుకున్న అమీర్..విష్ణు విశాల్ ఫ్యామిలీ

Posted : December 5, 2023 at 7:13 pm IST by ManaTeluguMovies

మిచౌంగ్ తుపాన్ దాడికి త‌మిళ‌నాడు..ఏపీ అత‌లాకుత‌ల‌మ‌వుతోంది. రెండు రోజులుగా భారీ వ‌ర్షాల‌తో ఎలాంటి ప‌రిస్థితులు నెల‌కొన్నాయో తెలిసిందే. చివ‌రికి మిచౌంగ్ కి సెల‌బ్రిటీలు సైతం తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నార‌ని తెలుస్తోంది. చెన్నై వ‌ర‌ద‌ల్లో బాలీవుడ్ మిస్ట‌ర్ ప‌ర్పెక్ట్ నిస్ట్ అమీర్ ఖాన్..ఆయ‌న‌తో పాటు న‌టుడు విష్ణు విశాల్ ఫ్యామిలీ కూడా వ‌ర‌ద‌లో ఇరుకున్న ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌స్తోంది.

విశాల్ భార్య గుత్త జ్వాల‌…ఇత‌ర ప్రముఖులు ఇళ్ల‌లో ఇరుక్కుపోయారు. కరపాకంలోని తమ ఇంట్లోకి వరద నీళ్లు వచ్చిన‌ట్లు తెలుస్తోంది. దీంతో క‌రెంట్ లేదు. క‌నీస అవ‌స‌రాలు తీర‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది. దీంతో విష్ణు విశాల్ తన ఇంటి మేడ మీదకు సిగ్నల్‌ వచ్చే ప్రాంతానికి వచ్చి తమ పరిస్థితిని ఫోటోలు తీసి సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. స‌హాయం కావాల‌ని కోర‌డంతో ప్ర‌భుత్వం వెంట‌నే రంగంలోకి దిగింది.

రెస్య్కూ సిబ్బంది విష్ణు విశాల్‌ ఉండే ప్రాంతానికి చేరుకుని వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అయితే వీరితో పాటు అమీర్‌ ఖాన్‌ ఉండటం ఉన్న‌ది అంద‌ర్నీ షాక్ కి గురిచేస్తుంది. ఇంత భారీ తుపాన్ నేప‌థ్యంలో అమీర్ ఖాన్ కి చెన్నైలో పనేంటి? ఆయ‌న ఎందుకు వెళ్లారు? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. ఆయ‌న కూడా వర‌ద‌ల్లో చిక్కుకోవ‌డంతో రెస్క్యూ అండ్ ఫైర్ సిబ్బంది ఆయ‌న్ని సుర‌క్షిత ప్రాంతానికి త‌ర‌లించిన‌ట్లు తెలుస్తోంది.

అమీర్‌ ఖాన్‌.. గుత్త జ్వాల ఫ్యామిలీ నీటి పడవలపై సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్న ఫోటోలను చూడొచ్చు. ప్ర‌స్తుతం ఈఫోటోలు నెట్టింట వైర‌ల్ గా మారాయి. అంద‌రి క‌ళ్లు అమీర్ వైపే ఉన్నాయి. ఆయ‌న తుపాన్ బాధితుల్ని ఆదుకునేందుకు వెళ్లారా? లేక వ‌ర‌ద బాధితుడిగా బ‌య‌ట‌కు వ‌స్తున్నారా? అన్న సందేహాలు నెటి జ‌నులు వ్య‌క్తం చేస్తున్నారు. ఈ ఘ‌ట‌న గురించి అమీర్ స్పందిస్తే ఆయ‌న అక్క‌డ ఎందుకు ఉన్నాడు? అన్న‌ది క్లారిటీ రాదు.


Advertisement

Recent Random Post:

YS Jagan to hold Press Meet at 2PM | Jagan Meet with YCP Senior Leaders

Posted : October 4, 2024 at 2:28 pm IST by ManaTeluguMovies

YS Jagan to hold Press Meet at 2PM | Jagan Meet with YCP Senior Leaders

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad