బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ ని హీరోయిన్ గా పరిచయం చేస్తూ సుజోయ్ ఘోష్ కింగ్ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. తండ్రి ట్యాగ్ నే టైటిల్ గా పెట్టి ఈ చిత్రాన్ని రూపొంది స్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్ మెంట్- మార్ ప్లిక్స్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇందులో షారుకు కుమార్తెకి గురువు పాత్ర పోషిస్తున్నట్లు ప్రచారం లో ఉంది.
ప్రస్తుతం ఈ సినిమా సెట్స్ లో ఉంది. తాజాగా ఇందులో తండ్రీ-కుమార్తెకు ధీటుగా మరో పాత్ర ఉంది. అదే విలన్ రోల్. అయితే ఆ పాత్ర కోసం సౌత్ స్టార్ హీరోని తీసుకునే పనిలో ఉన్నారు. దీనిలో భాగంగా ఇప్పటికే కొంతమంది స్టార్లతో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. దీంతో ఈ సినిమా పై అంచనాలు ఇంకా పెరిగిపోతున్నాయి. కుమార్తె కోసం షారుక్ ఖాన్ తన స్టార్ డమ్ ని సైతం పక్కనెబట్టి నటిస్తున్నాడు.
అతడి పాత్ర తెరపై కనిపించినంత సేపు పరుగులు పెట్టిస్తుందిట. కానీ నిడివి తక్కువ అని అంటున్నారు. అయినా షారుక్ ఖాన్ కుమార్తె కోసం రాజీ పడి ఆ రోల్ అంగీకరించినట్లు తెలుస్తోంది. అయితే తాజాగా ఆ రెండు పాత్రలకు ధీటుగా సౌత్ స్టార్ పై మేకర్స్ దృష్టి పెట్టడంతో మరింత ఆసక్తి సంతరించుకుంది. అంటే ఈ సినిమాని పాన్ ఇండియా లో రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. కోలీవుడ్ హీరోలతో షారుక్ ఖాన్ కి మంచి స్నేహం ఉంది.
తలపతి విజయ్ తో ఎంతో క్లోజ్ గా ఉంటారు. ఇంకా మరికొంత మంది స్టార్లతోనే మంచి రిలేషన్ షిప్ ఉంది. టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ తోనూ మంచి స్నేహం ఉంది. మరి కుమార్తె సినిమా కోసం ఏ స్టార్ ని ఒప్పిస్తున్నారు? అన్నది తెలియాలి.