Advertisement

వివాహ బంధంతో ఒకటైన ఆర్బాజ్-షురాఖాన్

Posted : December 25, 2023 at 6:36 pm IST by ManaTeluguMovies

బాలీవుడ్ న‌టుడు స‌ల్మాన్ ఖాన్ సోద‌రుడు ఆర్బాజ్ ఖాన్ మూడ‌వ‌సారి పెళ్లికి రెడీ అవుతున్న‌ట్లు రెండు.. మూడు రోజుల క్రితం నుంచి మీడియాలో వార్త‌లొస్తున్న సంగ‌తి తెలిసిందే. మ్యాక‌ప్ ఆర్టిస్ట్ షురా ఖాన్ తో ప్రేమ‌లో ఉన్న‌ట్లు..వివాహానికి రెడీ అవుతున్న‌ట్లు ప్ర‌చారం సాగింది. అయితే ఆ ప్ర‌చారాన్ని తాజాగా ఆ జోడీ నిజం చేసింది. ఇద్ద‌రు వివాహం చేసుకుని అభిమానుల్ని స‌ర్ ప్రైజ్ చేసారు.

ముంబైలోని ఆర్బాజ్ ఖాన్ సోద‌రి అర్పితాఖాన్ శ‌ర్మ నివాస‌రంలో ఈ వివాహ కార్య‌క్ర‌మం నిరాడంబ‌రంగా జ‌రిగింది. నికాహ్ వేడుకలో ఇద్ద‌రు ఒక‌ట‌య్యారు. త‌మ సంప్ర‌దాయాల ప్ర‌కారం వివాహ కార్య‌క్ర‌మాన్ని ముగించారు. అనంత‌రం అతిధులు నూత‌న వ‌ధువ‌రుల్ని అంతా ఆశీర్వ‌దించారు. ఈ వేడుక‌కు స‌ల్మాన్ ఖాన్…సోహైల్ ఖాన్.. తల్లిదండ్రులు సలీం ఖాన్- అర్హాన్ ఖాన్‌తో సహా కుటుంబ స‌భ్యులంతా పాల్గొన్నారు.

కేవ‌లం రెండు కుటుంబ స‌భ్యుల స‌మ‌క్షంలోనే వేడుక జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. షురాఖాన్ మ్యాక‌ప్ ఆర్టిస్ట్ గా ఎంతో ఫేమ‌స్. బాలీవుడ్ న‌టి ర‌వీనా టాండ‌న్ కి ప‌ర్స‌న‌ల్ మ్యాక‌ప్ ఆర్టిస్ట్ గా ఎప్ప‌టి నుంచి విధులు నిర్వ‌హిస్తోంది. మ‌రి శురాఖాన్ తో రిలేష‌న్ షిప్ ఎలా అంటే? ఆర్బాజ్ ఖాన్ గ‌తేడాది ‘పాట్నా శుక్లా’ అనే సినిమా చేసాడు. ఇందులో అనుష్క కౌశిక్… ర‌వీనా టాండ‌న్ న‌టించారు. ఆమె వ‌ద్ద చాలా కాలంగా ప‌నిచేస్తోంది. ఈ నేప‌థ్యంలో ఆ సినిమా షూటింగ్ లో ఆర్బాజ్-శురాఖాన్ మ‌ధ్య స్నేహం మొద‌ల‌వ్వ‌డం అది ప్రేమ‌కు దారి తీయ‌డం..ఇప్పుడు వివాహ బంధంతో ఒక‌ట‌వ్వ‌డం జ‌రిగింది.

రవీనా టాండన్- ఆమె కుమార్తె రాషా టాండన్‌తో కలిసి ఈ వేడుకకు హాజరయ్యారు. ఫరా ఖాన్, రితీష్ దేశ్‌ముఖ్ కూడా ఈ వేడుకకు హాజరయ్యారు. ఆర్బాజ్ ఖాన్ కిది మూడ‌వ వివాహం. తొలుత బాలీవుడ్ న‌టి మ‌లైకా అరోరాని పెళ్లి చేసుకున్నారు. ఆ దంప‌తులు 2016లో విడిపోయారు. ఆ త‌ర్వాత న‌టి జియార్జియా ఆండ్రియానితో కొన్నాళ్లు రిలేష‌న్ షిప్ లో ఉన్నాడు. అయితే ఇద్ద‌రు పెళ్లి చేసుకున్నారా? లేదా? అన్న‌ది ఇప్ప‌టికీ క్లారిటీ లేదు.


Advertisement

Recent Random Post:

Maa Nanna Super Hero Trailer | Sudheer Babu | Sayaji Shinde | Sai Chand | Abhilash |

Posted : October 5, 2024 at 6:14 pm IST by ManaTeluguMovies

Maa Nanna Super Hero Trailer | Sudheer Babu | Sayaji Shinde | Sai Chand | Abhilash |

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad