Advertisement

వీరమల్లుతో అందాల భామ.. అంతా సిద్ధం..!

Posted : January 9, 2023 at 10:21 pm IST by ManaTeluguMovies

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రిష్ కాంబోలో వస్తున్న భారీ బడ్జెట్ మూవీ హరి హర వీరమల్లు సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. సినిమాలో ఇప్పటికే నిధి అగర్వాల్ జాక్వెలిన్ లాంటి అందాల భామలు నటిస్తుండగా మరో అందాల భామ నోరా ఫతేహి కూడా భాగం అవుతుందని తెలుస్తుంది. బాహుబలి సినిమాలో ఇరుక్కుపో సాంగ్ తో పాపులర్ అయిన నోరా ఓ పక్క బాలీవుడ్ సినిమాలతో బిజీ బిజీగా ఉంటుంది. అయితే సౌత్ నుంచి ముఖ్యంగా టాలీవుడ్ నుంచి ఏ చిన్న ఛాన్స్ వచ్చినా సరే కాదనకుండా చేస్తుంది అమ్మడు.

పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు సినిమా లో కూడా నోరా ఫతేహి రిజిస్టర్ అయ్యే రోల్ లో నటిస్తుందని తెలుస్తుంది. ఈ నెల చివరన మొదలయ్యే షెడ్యూల్ లో నోరా పాల్గొంటుందని తెలుస్తుంది. ఆమెతో కీలక సన్నివేశాలు ఈ షెడ్యూల్ లో షూట్ చేస్తారని తెలుస్తుంది. వీరమల్లు సినిమాలో తన పాత్రతో మరోసారి తెలుగు ఆడియన్స్ ని అలరించనుంది నోరా ఫతేహి. వచ్చిన ప్రతి ఛాన్స్ వదలకుండా చేస్తూ వస్తుంది నోరా.

అందాల భామ బాలీవుడ్ సినిమాల్లో ఎక్కువగా స్పెషల్ సాంగ్స్ లో అలరిస్తుంది. తెలుగులో కూడా అలాంటి ఛాన్స్ లే వస్తుండటంతో ఇక్కడ కూడా తన టాలెంట్ చూపిస్తుంది. ఇక వీరమల్లు లాంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ లో నటించడం ఆమె కెరీర్ గ్రోత్ కి హెల్ప్ చేస్తుందని చెప్పొచ్చు.

హరి హర వీరమల్లు సినిమా క్రిష్ ఎంతో అద్భుతంగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తుంది. సినిమాలో ఫ్యాన్స్ అంతా సరికొత్త పవన్ కళ్యాణ్ ని చూస్తారని తెలుస్తుంది.

కీరవాణి మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాకు మ్యూజిక్ కూడా మరో హైలెట్ అయ్యేలా జాగ్రత్త వహిస్తున్నారని తెలుస్తుంది. కొన్నాళ్లుగా షూటింగ్ వాయిదా పడుతుండగా ఈసారి పవన్ సినిమా పూర్తి చేసేందుకు పూర్తి డేట్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది.

ఏ.ఎం.రత్నం నిర్మిస్తున్న ఈ సినిమా పవర్ స్టార్ ఫ్యాన్స్ అందరిని మెప్పించేలా చేస్తుందని అంటున్నారు. ఈ సమ్మర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఈ సినిమా సమ్మర్ కి కుదరకపోతే దసరాకి వాయిదా వేసే ఛాన్స్ ఉందని టాక్.


Advertisement

Recent Random Post:

Delhi Liquor Scamలో అరెస్టైతే అంతేనా? వాళ్ళకి బెయిల్ వచ్చే అవకాశమే లేదా?

Posted : June 26, 2024 at 10:30 pm IST by ManaTeluguMovies

Delhi Liquor Scamలో అరెస్టైతే అంతేనా? వాళ్ళకి బెయిల్ వచ్చే అవకాశమే లేదా?

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement