Advertisement

శంకూ పాపతో శృతిహాసన్ విహారం

Posted : January 14, 2023 at 8:33 pm IST by ManaTeluguMovies

మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా గోపీచంద్ మలిపనేని రూపొందించిన `క్రాక్` మూవీతో మళ్లీ ట్రాక్ లోకి వచ్చేసింది శృతిహాసన్. ఈ మూవీ తో టాలీవుడ్ లో ఫ్రెష్ గా ఇన్నింగ్స్ ని మొదలు పెట్టిన శృతి గతంతో పోలిస్తే జోరుగా సినిమాలు చేస్తూ ఆశ్చర్యపరుస్తోంది. పవన్ కల్యాణ్ నటించిన `వకీల్ సాబ్`తోనూ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న శృతి ఆ తరువాత బ్యాక్ టు బ్యాక్ క్రేజీ ఆఫర్లని సొంతం చేసుకుంటూ స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతోంది.

ఒకేసారి ఇద్దరు అగ్ర కథానాయకులు మెగాస్టార్ చిరంజీవి నందమూరి బాలకృష్ణలతో కలిసి నటించే అరుదైన అవకాశాన్ని సొంతం చేసుకుంది. బాలకృష్ణతో కలిసి నటించిన `వీర సింహారెడ్డి` జనవరి 12న చిరంజీవి నటించిన `వాల్తేరు వీరయ్య` జనవరి 13న ఈ సంక్రాంతి సందర్భంగా విడుదలయ్యాయి. ఒకే సంస్థ ఇద్దరు స్టార్ లతో నిర్మించిన సినిమాల్లో నటించిన హీరోయిన్ గా ప్రత్యేకతను చాటుకున్న శృతిహాసన్ ప్రస్తుతం నెట్టింట సందడి చేస్తోంది.

బాలకృష్ణతో కలిసి నటించిన `వీర సింహారెడ్డి` ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒంగోలులో జరిగింది. ఈ ఈవెంట్ కు బాలయ్యతో కలిసి ప్రత్యేక హెలికాప్టర్ లో వాలిపోయిన శృతిహాసన్ స్టేజ్ పై రచ్చ రచ్చ చేసింది. సినిమాలో పాటలకు స్టెప్పులేస్తూ హల్ చల్ చేసింది. అయితే దీని తరువాత చిరు నటించిన `వాల్తేరు వీరయ్య` ప్రీరిలీజ్ ఈవెంట్ కు మాత్రం ముఖం చాటేసింది. వైజాగ్ లోని ఆర్కే బీచ్ లో జరిగిన ఈవెంట్ లో శృతి కనిపించకపోవడంతో చిరు ఇండైరెక్ట్ గా పంచ్ లు వేసిన విషయం తెలిసిందే.

అయితే శృతిహాసన్ ఈవెంట్ కి హాజరు కాకపోవడంతో తను మానసిక రుగ్మతతో బాధపడుతోందంటూ నెట్టింట ప్రచారం జరిగింది. ఆ కారణంగానే తను `వాల్తేరు వీరయ్య` ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొనలేదని తాను వైరల్ పీవర్ తో ఇబ్బంది పడుతున్నానని తనకు ఎలాంటి మానసిక రుగ్మత లేదని సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేసింది. తనపై తప్పుడు ప్రచారం జరుగుతోందని కౌంటర్ వేసింది.

అయితే సరిగ్గా `వాల్తేరు వీరయ్య` రిలీజ్ రోజునే శృతిహాసన్ తన ప్రియుడితో కలిసి ముంబై వీధుల్లో విహరించడం ఇప్పుడు అనుమానాలకు తావిస్తోంది. అంతే కాకుండా ఈ మూవీ ప్రమోషన్స్తో పాటు సక్సెస్ పార్టీలోనే శృతి కనిపించకపోవడంతో అంతా అవాక్కవుతున్నారు. అంతే కాకుండా తన ప్రియుడితో కలిసి తన శంకూ పాప (బాయ్ ఫ్రెండ్ శంతను) తో కలిసి బయటికి వెళుతున్నానని శృతి ఓ ఫొటోని షేర్ చేయడం గమనార్హం. తను నిజంగానే వైరల్ ఫీవర్ తో ఇన్ని రోజులు బాధపడిందా? లేక కావాలనే ఈ మూవీ ప్రమోషన్స్ కి దూరంగా వుందా? అనే అనుమానాలు మొదలయ్యాయి.


Advertisement

Recent Random Post:

జగన్‌ను కలిసేందుకు భారీగా తరలివచ్చిన ప్రజలు | Pulivendula

Posted : June 23, 2024 at 9:43 pm IST by ManaTeluguMovies

జగన్‌ను కలిసేందుకు భారీగా తరలివచ్చిన ప్రజలు | Pulivendula

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement