Advertisement

సినిమా అంతా ఒకెత్తు.. చివరి అరగంట ఒకెత్తు..!

Posted : June 4, 2024 at 6:12 pm IST by ManaTeluguMovies

ప్రభాస్ తో నాగ్ అశ్విన్ కల్కి అంటూ భారీ ప్లానే వేశాడు. కల్కి సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా కల్కి 2898 ఏడి సినిమా ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమా రిలీజ్ దగ్గర పడుతున్నా కొద్దీ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి. కల్కి వరల్డ్ ఎలా ఉంటుంది.. అసలు కల్కి ఏం చేస్తాడు అన్నది శాంపిల్ గా కల్కి ప్రీల్యూడ్ తో చూపించాడు నాగ్ అశ్విన్. కల్కి యానిమేటెడ్ సీరీస్ చూసిన ఆడియన్స్ సినిమాపై ఒక అంచనాకు వచ్చారు. కల్కి సినిమాను నాగ్ అశ్విన్ అంచనాలకు మించి ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.

కల్కి సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా మొదటి పార్ట్ అన్ని పాత్రలను పరిచయం చేయడం భైరవ లక్ష్యం పెట్టుకోవడం ఫస్ట్ పార్ట్ లో చూపిస్తారని తెలుస్తుంది. ఇక కల్కి 2898 ఏడి క్లైమాక్స్ మాత్రం వేరే లెవెల్ లో ఉంటుందని తెలుస్తుంది. కల్కి యూనివర్స్ కు లీడ్ ఇస్తూ సెకండ్ పార్ట్ పై ఆసక్తి పెరిగేలా సస్పెన్స్ లో కల్కి ఫస్ట్ పార్ట్ ని ముగిస్తారట.

అంతేకాదు కల్కి సినిమా అంతా ఒక ఎత్తైతే.. చివరి అరగంట మరో ఎత్తని అంటున్నారు. ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేసే అద్భుతమైన విజువల్స్ తో కల్కి ఉండబోతుందని తెలుస్తుంది. ఈ సినిమా కోసం నాగ్ అశ్విన్ ఒక యానిమేషన్ కంపెనీనే రన్ చేస్తున్నాడని తెలుస్తుంది. కల్కి తో ప్రభాస్ హాలీవుడ్ రేంజ్ కి వెళ్తాడని అంటున్నారు.

ఈ సినిమాలో పాన్ ఇండియా స్టార్స్ భాగం అవుతున్నారు. ప్రభాస్ సరసన దీపిక పదుకొనె నటిస్తున్న కల్కిలో కమల్ హాసన్, అమితాబ్, దిశా పటాని, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, శోభన ఇలా అందరు తమ ఎంట్రీతో ఆడియన్స్ ని అలరిస్తారని తెలుస్తుంది. కల్కి 2898 ఏడి ఫస్ట్ డే భారీ టార్గెట్ ని ఫిక్స్ చేసుకున్నారట. అందుకే సినిమాను నెవర్ బిఫోర్ అనే రేంజ్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట. మొత్తానికి కల్కి 2898 ఏడి తో నాగ్ అశ్విన్ తన సత్తా చాటాలని ఫిక్స్ అయ్యాడని చెప్పొచ్చు. ప్రభాస్ కూడా బాహుబలి తర్వాత కల్కితో మరోసారి తన మాస్ స్టామినా చూపించడానికి సిద్ధమయ్యాడు.


Advertisement

Recent Random Post:

నా MP పదవి, ఇల్లు లాగేసుకున్నారు – MP Rahul Gandhi Sensational Comments on BJP in Parliament

Posted : July 1, 2024 at 8:29 pm IST by ManaTeluguMovies

నా MP పదవి, ఇల్లు లాగేసుకున్నారు – MP Rahul Gandhi Sensational Comments on BJP in Parliament

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement