Advertisement

సోలో బతుకే బిజినెస్ క్లోజ్

Posted : March 9, 2020 at 2:53 pm IST by ManaTeluguMovies

ప్రతి రోజూ పండగే సినిమా తరువాత హీరో సాయి ధరమ్ తేజ్ చేస్తున్న సినిమా సోలో బతుకే సో బెటర్. ఈ సినిమా మీద కాస్త పాజిటివ్ బజ్ వుంది. దాంతో బిజినెస్ క్లోజ్ కావడం మాత్రమే కాదు. మంచి రేటు రావడం విశేషం. వాస్తవానికి టోటల్ గా తెలుగు రాష్ట్రాల హక్కులు కావాలని దిల్ రాజు, యువి వంశీ అడిగారు కానీ, నిర్మాత బోగవిల్లి ప్రసాద్ విడివిడిగానే ఇచ్చేసారు.

ఆంధ్రను తొమ్మిది కోట్ల రేషియోలో ఇవ్వడం విశేషం. మంచి రేటు వచ్చినట్లే లెక్క. విశాఖకు 2.10 కోట్లు కట్టి దిల్ రాజు తీసుకున్నారు. ఈస్ట్ అనిల్ సుంకర, వెస్ట్ ప్రవీణ్, కృష్ణ అలంకార్ ప్రసాద్, గుంటూరు, నెల్లూరు యువి వంశీ తీసుకున్నారు

నైజాం ను దిల్ రాజు అయిదు కోట్లకు తీసుకున్నారు. హిందీ డబ్బింగ్ మినహా నాన్ థియేటర్ కూడా బిజినెస్ ఫినిష్ చేసారు. ప్రతి రోజూ పండగే పెద్ద హిట్ కావడం, సమ్మర్ లో విడుదల అవుతుండడం, పెద్దగా పోటీ లేకపోవడంతో బిజినెస్ ఫాస్ట్ గా క్లోజ్ అయింది.


Advertisement

Recent Random Post:
Advertisement