Advertisement

స్టార్ హీరోని చంప‌డానికి పిల్ల‌ల చేతికి తుపాకులు?!

Posted : June 4, 2024 at 6:05 pm IST by ManaTeluguMovies

మైన‌ర్ పిల్ల‌లు క‌త్తులు, తుపాకుల‌తో బెదిరించ‌డం, హ‌త్య‌లు చేయ‌డం లేదా బాంబులు విసిరి భీభ‌త్సం సృష్టించ‌డం.. ఇవ‌న్నీ సినిమాల్లోనే చూశాం. చాలా హాలీవుడ్ సినిమాల్లో ఇలాంటి స‌న్నివేశాలు చూపించారు. ఇంత‌కుముందు కొన్ని త‌మిళ చిత్రాల్లో కూడా ఇదే త‌ర‌హా స‌న్నివేశాల్ని చూపించడంతో మ‌న ఆడియెన్ కూడా నిర్ఘాంత‌పోయారు.

అయితే సినిమాలో చూపించిన‌ట్టే, ఇప్పుడు ఓ ప్ర‌ముఖ హీరోని హ‌త్య చేయించేందుకు గ్యాంగ్ స్ట‌ర్స్ మైన‌ర్ పిల్ల‌ల‌ను ఉప‌యోగించుకోవాల‌ని ప‌న్నాగం ప‌న్నారు. దానికోసం స‌ద‌రు హీరోగారి ఫామ్ హౌస్ లోనే రెక్కీ నిర్వ‌హించారు. హ‌త్య చేసి అట్నుంచి శ్రీ‌లంక‌కు పారిపోవాల‌ని బిగ్ స్కెచ్ వేసారు. అయితే ఈలోగానే ఈ కుట్ర‌లో భాగం అయిన న‌లుగురు కీల‌క స‌భ్యుల‌ను ముంబై పోలీసులు అరెస్ట్ చేసారు. ఇప్పుడు విచార‌ణ‌లో ఇలాంటి ఎన్నో క‌ఠోర‌మైన నిజాలు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. ఈ ఎపిసోడ్ లో గ్యాంగ్ స్ట‌ర్స్ టార్గెట్ చేసిన స్టార్ హీరో ఎవ‌రో చెప్పాల్సిన ప‌ని లేదు. అత‌డే స‌ల్మాన్ ఖాన్. గ్యాంగ్ స్ట‌ర్ లారెన్స్ బిష్ణోయ్ జైలు నుంచే ఈ కుట్ర ప‌న్నాడు. అత‌డి అనుచ‌రులు బ‌య‌ట చేయాల్సిన‌దంతా చేస్తున్నారు.

లారెన్స్ బిష్ణోయ్- గోల్డీ బ్రార్ ముఠాలు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌ను హత్య చేయడానికి మైనర్‌లను నియమించాలని భావించినట్లు పోలీసులు తాజాగా మీడియాకు తెలిపారు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుడు అజయ్ కశ్యప్ , మరో నిందితుడి మధ్య జరిగిన వీడియో కాల్ సంభాషణను బహిర్గతం చేయడం ద్వారా నవీ ముంబై పోలీసులు తమ దర్యాప్తులో సల్మాన్ ని చంపడానికి ఎలాంటి కుట్ర చేస్తున్నారో కనుగొన్నారు. ఈ సంభాషణ ప్రకారం.. కెనడాకు చెందిన గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ ఆదేశాల మేరకు ఆధునిక ఆయుధాల వినియోగంలో శిక్షణ పొందిన షార్ప్‌షూటర్లు ముంబై, థానే, నవీ ముంబై, పూణే, రాయ్‌గఢ్, గుజరాత్‌లలో ప్రిప‌రేష‌న్ లో ఉంచారు. కుట్ర‌ ప్రకారం, షార్ప్‌షూటర్లు అన్మోల్ బిష్ణోయ్ – రోహిత్ గోదారా 18 ఏళ్లలోపు మైనర్‌లను ఈ పని కోసం ఉపయోగించుకోవాలని గోల్డీ బ్రార్ ఆదేశించినట్లు అధికారులు తెలిపారు.

ఎఫ్ఐఆర్ ప్రకారం.. జాన్ అనే వ్యక్తి ఆపరేషన్ కోసం వాహనాన్ని అందించే పనిలో ఉన్నాడు. దాడి తర్వాత ముఠా సభ్యులు కన్యాకుమారి వద్ద మళ్లీ గుమిగూడి సముద్ర మార్గం ద్వారా శ్రీలంకకు పారిపోవాల‌నేది ప్లాన్. అక్కడి నుంచి వారిని ఇతర దేశాలకు పంపించేందుకు ఏర్పాట్లు చేశార‌ని, కెనడాలో ఉన్న గ్యాంగ్‌స్టర్ అన్మోల్ బిష్ణోయ్ వారి ప్రయాణానికి ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లారెన్స్ బిష్ణోయ్ , సంపత్ నెహ్రా గ్యాంగ్‌లు సల్మాన్ ఖాన్ బాంద్రా నివాసం, పన్వెల్ ఫామ్‌హౌస్, సినిమా షూటింగ్ ప్రదేశాలలో రెక్కీ నిర్వహించే ప్రయత్నాలలో భాగంగా సల్మాన్ ఖాన్ కదలికలను పర్యవేక్షించడానికి దాదాపు 60 నుండి 70 మంది సభ్యులను మోహరించారు. అయితే ఇంత‌లోనే సల్మాన్ ఖాన్ కారుపై దాడికి ప్లాన్ చేసిన నలుగురు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యులను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. న్‌ను హతమార్చేందుకు పథకం రచించారనే నిర్దిష్ట సమాచారం మేరకు.. గుర్తించిన 17 మంది నిందితులు ఇతరులపై ఏప్రిల్ 24న పన్వెల్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

నిందితుల్లో లారెన్స్ బిష్ణోయ్, అతని సోదరుడు అన్మోల్, ముఠా సభ్యుడు సంపత్ నెహ్రా, గోల్డీ బ్రార్, అజయ్ కశ్యప్ అలియాస్ ధనంజయ్ తాపేసింగ్, సుఖా షూటర్, సందీప్ బిష్ణోయ్ అలియాస్ గౌరవ్ భాటియా, వసీం చైనా, డోగర్ తదితరులు ఉన్నారు. అజయ్ కశ్యప్ పాకిస్థాన్‌కు చెందిన డోగర్ అనే వ్యక్తికి మధ్య వీడియో కాల్ సంభాష‌ణ జ‌రిగిన‌ట్టు పోలీసులు గుర్తించారు. ఎఫ్‌ఐఆర్ ప్రకారం.. ముఠా సభ్యుడి సమక్షంలో కశ్యప్ ఈ కాల్‌ను ప్రారంభించాడు.. తరువాత అతను పోలీసులకు ఇన్‌ఫార్మర్‌గా మారాడు.

గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ త‌మ‌ ఖాతాలో 50 శాతం మొత్తాన్ని డిపాజిట్ చేసిన తర్వాత పాకిస్థాన్ నుంచి ఏకే-47లు సహా ఆయుధాలను సేకరించడంపై కశ్యప్ చర్చించినట్లు పోలీసులు తెలిపారు. ఆయుధాలు డెలివరీ అయిన తర్వాత మిగిలిన మొత్తాన్ని చెల్లించవచ్చు. వీడియో కాల్ సమయంలో డోగర్ కశ్య‌ప్‌కు AK-47లు ఇతర మోడ‌ల్స్ సహా 4 నుండి 5 ఆయుధాలను చూపించాడు. ఒక సంభాషణలో సల్మాన్ ఖాన్ బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో తిరుగుతున్నప్పటికీ, షూటర్లు అతన్ని చంపేస్తారని కశ్యప్ ఆ వ్యక్తికి (తరువాత పోలీసు ఇన్ఫార్మర్ అయ్యాడు) చెప్పినట్లు ఎఫ్ఐఆర్ పేర్కొంది. కశ్యప్ అతని సహచరులు సల్మాన్ ఖాన్ ఫామ్‌హౌస్‌లో నిఘా నిర్వహించారు.

రైల్వే స్టేషన్‌లు, రిక్షా స్టాండ్‌లు .. పన్వెల్ బస్టాండ్‌ సహా వివిధ ప్రదేశాలలో స‌ల్మాన్ ప్రయాణ మార్గం మొత్తం ఎలా ఉందో చర్చించారు. నవీ ముంబై పోలీసుల తదుపరి దర్యాప్తులో వివిధ ప్రదేశాలలో కశ్యప్ కదలికలను బహిర్గతం చేశారు. వీటిలో కొన్ని అక్రమ ఆయుధాల స్మగ్లింగ్‌కు ప్రసిద్ధి చెందిన స్థ‌లాలు ఉన్నాయి, వాటిలో కొన్ని కాశ్మీర్, గంగా నగర్, పాకిస్తాన్ , నేపాల్ సరిహద్దులు, బీహార్, శివన్, గోరఖ్‌పూర్, తమిళనాడులోని తిరునల్వేలి పేర్లు ఉన్నాయి. కశ్యప్ గతంలో త‌న‌ తండ్రి ఆనంద్ పాల్ నేతృత్వంలోని ముఠాను నడుపుతున్న చిను అనే మహిళతో కూడా పరిచయం కలిగి ఉన్నాడు. ఈ ముఠాకు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి మద్దతు లభించింది. పోలీసు ఎన్‌కౌంటర్‌లో ఆనంద్ పాల్ మరణించిన తర్వాత చిను గల్ఫ్ దేశాలలో అంత‌గా ప‌రిచ‌యం లేని ప్రదేశాల నుండి ముఠాను నడుపుతున్నాడని ఇన్‌ఫార్మర్ పోలీసులకు చెప్పాడు.

అజయ్ కశ్యప్, సందీప్ బిష్ణోయ్, గౌరవ్ భాటియా, సుఖా షూటర్, వసీం చైనా ఇతరుల మధ్య జరిగిన సంభాషణలలో ఖాన్‌ను చంపడానికి AK-47, M-16, AK 92 – జిగానా వంటి ఆయుధాలను కొనుగోలు చేయడం గురించి చర్చలు కూడా జరిగాయి. గాయకుడు సిద్ధు మూసేవాలా హత్యకు జిగానా అనే సెమీ ఆటోమేటిక్ పిస్టల్ ఉపయోగించినట్లు భావిస్తున్నారు.

సల్మాన్ ఖాన్‌పై దాడికి కుట్ర పన్నిన కేసులో హర్యానాకు చెందిన బిష్ణోయ్ , గోల్డీ బ్రార్ గ్యాంగ్‌లకు చెందిన వ్యక్తి సహా ఐదుగురిని నవీ ముంబై పోలీసులు అరెస్టు చేసినట్లు అధికారులు ఆదివారం తెలిపారు. గత ఏడాది సెప్టెంబర్-అక్టోబర్‌లో స‌ల్మాన్ కి హాని కలిగించే కుట్ర గురించి పక్కా సమాచారం అందడంతో అరెస్టులు జరిగాయి. విచారణలో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సోషల్ మీడియా గ్రూపుల్లోకి చొరబడడంపై పోలీసులు విచారించారు. తీగ లాగితే డొంకంతా క‌దిలిన‌ట్టు చాలా విష‌యాలు వెలుగు చూసాయి.


Advertisement

Recent Random Post:

Nag Ashwin Interview | ‘We’ll introduce 4th world in Kalki 2″ | Prabhas | SS Rajamouli | Mahabharata

Posted : July 5, 2024 at 1:41 pm IST by ManaTeluguMovies

Nag Ashwin Interview | ‘We’ll introduce 4th world in Kalki 2″ | Prabhas | SS Rajamouli | Mahabharata

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement