Advertisement

స్పెషల్: ఆర్ఆర్ఆర్ కి మోక్షం కలిగించనున్న బాలీవుడ్ బ్యూటీ

Posted : March 12, 2020 at 6:31 pm IST by ManaTeluguMovies

ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై రానున్న భారీ బడ్జెట్ ఫిలిమ్స్ లో దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ కూడా ఒకటి. తెలుగు స్టార్ హీరోస్ ఎన్.టి.ఆర్ – రామ్ చరణ్ లు హీరోలుగా, హాలీవుడ్ స్టార్స్ రే స్టీవెన్సన్, అలిసన్ డూడి, ఒలీవియా మోరిస్ లతో పాటు బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగన్, అలియా భట్ లాంటివారు ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా 2021 జనవరి 8న రిలీజ్ కానుంది.

ఈ సారి అన్న డేట్స్ అస్సలు మిస్ కాకూడదని శరవేగంగా షూటింగ్ చేస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ సినిమాకి సైన్ చేసింది కానీ తన షెడ్యూల్స్ గతంలో రెండు సార్లు కాన్సల్ అయ్యాయి. ఆ తరవాత డేట్స్ కుదరకపోవడంతో ఇప్పటికీ ఆర్ఆర్ఆర్ షూట్ లో ఆమె పాల్గొనలేదు. మేము తెలుసుకున్న లేటెస్ట్ న్యూస్ ప్రకారం తాజాగా అలియా భట్ ఆర్ఆర్ఆర్ కోసం డేట్స్ ఇచ్చింది.

మార్చి చివరి నుంచి పూణేలో ప్రారంభమయ్యే షెడ్యూల్ నుంచి అలియా భట్ జాయిన్ అవుతుంది. ఈ షెడ్యూల్ లో రామ్ చరణ్ – అలియా భట్ లపై కీలక సన్నివేశాలను షూట్ చేస్తారు. ఏప్రిల్ లో చరణ్ – అలియా పార్టీ ని ఫినిష్ చేస్తారు. ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుగుతోంది.


Advertisement

Recent Random Post:
Advertisement