Advertisement

2 రోజుల్లో అందాల‌ న‌య‌న్ ల‌వ్ స్టోరి తెర‌పైకి..!

Posted : November 16, 2024 at 2:40 pm IST by ManaTeluguMovies

నెట్‌ఫ్లిక్స్ ఇండియా OTT డాక్యుమెంటరీ `బియాండ్ ది ఫెయిరీ టేల్`లో విఘ్నేష్ శివన్‌తో న‌య‌న్ ప్రేమకథను చూపిస్తున్న సంగ‌తి తెలిసిందే. డాక్యుమెంటరీ నవంబర్ 18న న‌య‌న‌తార‌ పుట్టినరోజున ప్రదర్శిత‌మ‌వుతుంది. ఈ ఏడాదితో నయనతార 40 ఏళ్లు పూర్తి చేసుకోనుంది. ఈ డాక్యుమెంటరీలో నయనతార వ్యక్తిగత జీవితాన్ని చూపించ‌నున్నారు. ప్ర‌స్తుతం ఈ డాక్యుమెంట‌రీ నెటిజనుల్లో చ‌ర్చ‌గా మారింది. నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్ నుండి ఒక క్లిప్ విడుదలైన తర్వాత ప్ర‌జ‌ల్లో ఉత్సుక‌త పెరిగింది. డాక్యుమెంటరీ లో న‌య‌న్ వ్యక్తిగత జీవితం, భర్త విఘ్నేష్ శివన్‌తో ప్రేమ కథను చూపిస్తున్నారు. తాజాగా విడుద‌లైన టీజ‌ర్ ఆస‌క్తిని పెంచింది. నెట్‌ఫ్లిక్స్ లో విడుద‌లైన టీజ‌ర్ దాదాపు 4 మిలియన్ వీక్ష‌ణ‌లు పొందింది.

న‌య‌న‌తార ప్ర‌స్తుతం త‌న డాక్యుమెంటరీని ప్ర‌మోట్ చేసుకునే ప‌నిలో ఉంది. ఇదే స‌మ‌యంలో ఈ బ్యూటీ చీర‌లో క‌నిపించిన ఫోటోగ్రాఫ్స్ ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ గా మారుతున్నాయి. న‌య‌న్ అల్ట్రా గ్లామ‌ర‌స్ ఫోజులు ఇప్పుడు ఇంట‌ర్నెట్ ని షేక్ చేస్తున్నాయి. ఈ ఫోటోషూట్ వీక్షించాక న‌య‌న్ అంద‌చందాల‌కు మ‌తులు చెడిపోతున్నాయ్ అంటూ ఫ్యాన్స్ వ్యాఖ్యానిస్తున్నారు.

న‌య‌న్ – విఘ్నేష్ గ‌తంలోకి వెళితే.. 9 జూన్ 2022న మహాబలిపురంలో విఘ్నేష్‌- న‌య‌న్ వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లికి షారూఖ్ ఖాన్, రజనీకాంత్, AR రెహమాన్ వంటి దిగ్గజాలు హాజర‌య్యారు. తాజా వీడియోలో.. నయనతార మొదటిసారిగా విఘ్నేష్‌ను వేరే కోణంలో ఎలా చూసింది? అనేదానిపై హృద‌యాల‌ను తాకే జ్ఞాపకాన్ని షేర్ చేసింది. పాండిచ్చేరిలో షూటింగ్ సమయంలో విజయ్ సేతుపతిని డైరెక్ట్ చేస్తున్న విఘ్నేష్ లోని ఆక‌ర్షణ తనను మంత్రంలా తాకినట్లు గుర్తుచేసుకుంది. స‌డెన్‌గా విఘ్నేష్ ఒక భిన్న‌మైన వ్య‌క్తి అని గమనించినట్లు అంగీకరించింది. అతడిని అందమైన వ్యక్తి అని అభివర్ణించింది. ఫిలింమేకింగ్ లో అతడి విధానాన్ని న‌య‌న‌తార‌ మెచ్చుకుంది. అదే క్లిప్‌లో విఘ్నేష్ తన దృక్పథాన్ని బయటపెట్టాడు. అతడు మొదట్లో `నయన్ మేడమ్` ప్రతిభ, వృత్తిగ‌త నైపుణ్యాన్ని ప్ర‌శంసించాడు. కాలక్రమేణా త‌మ మ‌ధ్య‌ సంభాషణలు లోతుగా మారాయి. త‌మ మ‌ధ్య ప్రత్యేక సంబంధాన్ని విఘ్నేష్ -నయ‌న్ నెమ్మ‌దిగా గ్రహించారు. మొత్తానికి డాక్యుమెంట‌రీలో వారి ప్రేమ‌క‌థ నిజంగా ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.


Advertisement

Recent Random Post:

సిరియా అధ్యక్ష భవనంపై తిరుగుబాడు దారుల జెండా | Syrian Rebels Enter President Assad’s Palace in Syria

Posted : December 3, 2024 at 7:24 pm IST by ManaTeluguMovies

సిరియా అధ్యక్ష భవనంపై తిరుగుబాడు దారుల జెండా | Syrian Rebels Enter President Assad’s Palace in Syria

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad