Advertisement

3 ని.ల్లో 184 సెల్ఫీలతో స్టార్ హీరో గిన్నిస్ వరల్డ్ రికార్డ్

Posted : February 22, 2023 at 10:50 pm IST by ManaTeluguMovies

సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ కీర్తికిరీటంలో మరో కలికితురాయి చేరింది. అతను మూడు నిమిషాల్లో అత్యధిక సెల్ఫీ (సెల్ఫీ ఫోటోగ్రాఫ్)లు తీసిన హీరోగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ను బద్దలు కొట్టాడు. ఇది రేర్ ఫీట్. అక్షయ్ ఎన్నడూ ఊహించని ఫీట్. తన తదుపరి చిత్రం సెల్ఫీ ప్రమోషన్ కోసం ముంబైలో అభిమానులతో మీట్-అండ్-గ్రీట్ లో మూడు నిమిషాల్లో 184 సెల్ఫీలు దిగడంతో ఇప్పుడు ఈ ఫీట్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ టైటిల్ హోల్డర్ గా మార్చింది.

అక్షయ్ కుమార్ కంటే ముందే గిన్నిస్ వరల్డ్ రికార్డ్ లు బద్దలు కొట్టిన వారెందరున్నారు? అన్నది ఆరా తీస్తే.. జేమ్స్ స్మిత్ (అమెరికా) మూడు నిమిషాల్లో 168 సెల్ఫ్ పోర్ట్రెయిట్ ఫోటోల రికార్డును కలిగి ఉన్నాడు. ఖిలాడీ అక్కీ ఈ రికార్డును బద్దలు కొట్టాడు. అంతకుముందు 2015 గ్లోబల్ ఐకాన్ – హాలీవుడ్ నటుడు డ్వేన్ జాన్సన్ లండన్ లోని శాన్ ఆండ్రియాస్ ప్రీమియర్ లో మూడు నిమిషాల్లో 105 సెల్ఫ్ పోర్ట్రెయిట్ ఫోటోగ్రాఫ్ లతో (సెల్ఫీలు) ఈ రికార్డును తన పేరిట లిఖించాడు. దానిని స్మిత్ అధిగమించగా ఇతడిని ఖిలాడీ కుమార్ బ్రేక్ చేసి సంచలనంగా మారాడు.

అక్షయ్ గిన్నిస్ రికార్డును బద్దలు కొట్టడంపై మాట్లాడుతూ-“ఈ ప్రత్యేకమైన ప్రపంచ రికార్డ్ ను బద్దలు కొట్టడం ఇలాంటి ఒక అరుదైన క్షణాన్ని నా అభిమానులతో పంచుకోవడం ఆనందంగా ఉంది. నేను ఇప్పటివరకు సాధించిన ప్రతిదీ నేను ఇక్కడ ఉండటానికి కారణం.. నా జీవితంలో ఈ ఎదుగుదలకు ప్రతిచోటా ఉన్న నా అభిమానుల బేషరతు ప్రేమ మద్దతు ప్రధాన కారణం. నా కెరీర్ లో నాకు నా పనికి అండగా నిలిచిన అందరికీ ప్రత్యేక నివాళి అర్పించే మార్గమిదని భావిస్తున్నాను!“ అన్నారు.

అక్షయ్ కుమార్ గత ఏడాది బ్యాక్ టు బ్యాక్ భారీ డిజాస్టర్లతో నిరాశలో ఉన్నాడు. తదుపరి `సెల్ఫీ`తో ఎట్టి పరిస్థితిలో హిట్టు కొట్టాలని పంతంతో ఉన్నాడు. ఈ చిత్రంలో ఇమ్రాన్ హష్మీతో కలిసి అక్కీ కనిపించనున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి 24న విడుదల కానుంది. ఇది పృథ్వీరాజ్ – సూరజ్ వెంజరమూడ ప్రధాన పాత్రల్లో నటించిన 2019 మలయాళ-భాష కామెడీ-డ్రామా `డ్రైవింగ్ లైసెన్స్` కి అధికారిక హిందీ రీమేక్. ఈ చిత్రాన్ని కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్ .. అక్షయ్ కుమార్ కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్ సమర్పణలో సుకుమారన్ – పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్ అండ్ మ్యాజిక్ ఫ్రేమ్స్ సంయుక్తంగా నిర్మించాయి.


Advertisement

Recent Random Post:

YS Jagan Will Become CM | Actor Vishal | AP Elections 2024

Posted : April 22, 2024 at 8:56 pm IST by ManaTeluguMovies

YS Jagan Will Become CM | Actor Vishal | AP Elections 2024

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement