Advertisement

50 కోట్ల న‌ష్టాలు తప్పలేదు!

Posted : November 10, 2023 at 6:07 pm IST by ManaTeluguMovies

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ వ‌రుస ప‌రాభ‌వాలు చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. కంగ‌న‌కు బాక్సాఫీస్ వద్ద మరో ఎదురుదెబ్బ తగిలింది. కంగ‌న న‌టించిన తాజా రిలీజ్ తేజస్ బాక్సాఫీస్ వ‌ద్ద మ‌రో డిజాస్ట‌ర్ గా నిలిచింది. ఈ ఫ‌లితం కంగ‌న‌ను మ‌రోసారి తీవ్ర నిరాశ‌లో కూరుకుపోయేలా చేసింద‌ని ట్రేడ్ విశ్లేషిస్తోంది.

ఇటీవ‌ల సినీ ప‌రిశ్ర‌మ‌లో బాక్సాఫీస్ వైఫల్యాల జాబితాలో ఈ సినిమా కూడా చేరింది. ఇది కూడా కంగనా కెరీర్ లో త‌క్కువ వ‌సూల్ చేసిన చిత్రాలలో ఒకటి. సర్వేష్ మేవారా దర్శకత్వం వహించిన తేజస్ రూ. 70 కోట్ల బడ్జెట్‌తో నిర్మించగా.. దేశంలో థియేట్రికల్ రన్ ముగిసే సమయానికి రూ. 4.25 కోట్లు రాబట్టింది.

బాలీవుడ్ హంగామా క‌థ‌నం ప్రకారం… తేజస్ సుమారు రూ. థియేట్రికల్ రన్ ద్వారా 70 లక్షలు.. భారతదేశంలో పంపిణీదారుల వాటా కింద‌ కేవలం రూ. 1.91 కోట్లు, ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ షేర్ మొత్తం రూ. 32 లక్షలు వ‌సూలు చేసింది. ఈ చిత్రం శాటిలైట్, డిజిటల్ స్ట్రీమింగ్,యు మ్యూజిక్ రైట్స్ దాదాపు రూ. 17 కోట్లు. ఈ గణాంకాలు కలిపితే మొత్తం రూ. 19.23 కోట్లుగా లెక్క తేలింది. అంటే తేజ‌స్ తో న‌ష్టాలు 50 కోట్లు అని ట్రేడ్ లెక్క చెబుతోంది.

ఈ రిజ‌ల్ట్ తో నిర్మాతలకే కాకుండా కంగనాకు కూడా ఆర్థికంగా ఎదురుదెబ్బ తగిలిందని స‌ద‌రు వెబ్ సైట్ క‌థ‌నం పేర్కొంది. తేజస్ లో కంగనా రనౌత్‌తో పాటు, అన్షుల్ చౌహాన్, వరుణ్ మిత్ర, అనుజ్ ఖురానా, వీణా నాయర్ త‌దిత‌రులు న‌టించారు. ఆన్ లైన్ పోర్టల్ క‌థనం ప్రకారం.. ఇది కంగ‌న‌కు వరుసగా ఐదవ బాక్సాఫీస్ వైఫల్యం. జడ్జిమెంటల్ హై క్యా, పంగా, తలైవి, ధాకడ్ అన్నీ టిక్కెట్ విండో వద్ద ఫెయిల‌వ్వ‌గా, ఇప్పుడు తేజ‌స్ కూడా ఈ వ‌ర‌సలో చేరింది.

ఇప్పుడు కంగ‌న ముందున్న ఏకైక ల‌క్ష్యం ఎమ‌ర్జెన్సీ చిత్రాన్ని హిట్ చేయ‌డ‌మే. బాక్సాఫీస్ వ‌ద్ద బంప‌ర్ హిట్ కొట్ట‌డం ద్వారా ఈ సంవత్సరాన్ని ముగించాలని కంగనా భావిస్తోంది. కంగ‌న‌ రనౌత్ దర్శకత్వం వహించి, నిర్మించిన ఈ చిత్రం చ‌రిత్ర నేప‌థ్యంలోని బ‌యోపిక్ త‌ర‌హా. ఇండియా ఎమర్జెన్సీ కాలం ఆధారంగా, భారత దివంగత ప్రధాని ఇందిరా గాంధీ క‌థ‌తో ఈ సినిమా తెర‌కెక్కింది. ఇందిర‌మ్మ‌గా కంగ‌న‌ ప్రధాన పాత్రలో న‌టించింది. త్వ‌ర‌లో ఈ సినిమా విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. ఈ సినిమా కోసం ఆస్తులు అమ్మి మ‌రీ పెట్టుబ‌డి పెట్టాన‌ని కంగ‌న ఇంత‌కుముందు వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే.


Advertisement

Recent Random Post:

Tirumala Laddu Controversy : ఆలయశుద్ధి, సంప్రోక్షణ చేపట్టాలని నిర్ణయం

Posted : September 21, 2024 at 1:54 pm IST by ManaTeluguMovies

Tirumala Laddu Controversy : ఆలయశుద్ధి, సంప్రోక్షణ చేపట్టాలని నిర్ణయం

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad