ఆచార్య తర్వాత లూసిఫర్ రీమేక్ చేస్తున్నట్టు చిరంజీవి ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేసారు. లూసిఫర్ రీమేక్ తప్పకుండా చేస్తానని, ఇంకా దర్శకుడు ఎవరనేది నిర్ణయం కాలేదని చెప్పారు.
అయితే లూసిఫర్ రీమేక్ చేయడానికి పవన్ కళ్యాణ్ ఆసక్తిగా ఉన్నారట కదా అని అడిగితే అది తన దృష్టికి రాలేదని, ఒకవేళ పవన్ కి లూసిఫర్ చేయాలని వుంటే కనుక అతనికే ఇచ్చేస్తానని, కానీ ఇంతవరకు పవన్ తనతో అదేమీ చెప్పలేదని చిరంజీవి చెప్పారు.
మలయాళంలో మోహన్ లాల్ హీరోగా నటించిన లూసిఫర్ రాజకీయ నేపథ్యంలో ఆసక్తికర డ్రామాకి తోడు మంచి హీరోయిజంతో ఉంటుంది. మలయాళ చిత్రం చూసి చిరంజీవి చేయడానికి ముచ్చట పడడంతో రామ్ చరణ్ ఆ సినిమా రీమేక్ హక్కులు తీసుకున్నాడు. అయితే ముందుగా ఆచార్య చేస్తున్న చిరంజీవి ఆ రీమేక్ ని వచ్చే ఏడాదికి వాయిదా వేశారు.