Advertisement

ఫోటో స్టోరీ: దిండు చుట్టుకున్న పాయల్

Posted : April 18, 2020 at 5:45 pm IST by ManaTeluguMovies

హీరోయిన్ టవల్ చుట్టుకుని ఎక్స్‌ఫోజింగ్ చేయడం ఓల్డ్ ఫ్యాషన్… అందుకే వెరైటీగా పిల్లో చుట్టుకుని ఫోటోలకి ఫోజిచ్చింది పాయల్ రాజ్‌పుత్. ఈ ఏడాది రవితేజ ‘డిస్కో రాజా’ సినిమాలో కనిపించిన పాయల్, ‘పిల్లో ఛాలెంజ్’ స్వీకరించి, ఇలా ఒంటిమీద దిండును ధరించింది. ‘క్వారంటైన్ క్వీన్… మేక్ ఇట్ ఫ్యాషన్… ఎందుకంటే నాకు ఇంట్లో ఉండి ఉండి బోర్ కొడుతోంది’ అంటూ పిల్లోతో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిందీ హాట్ బ్యూటీ.

ఎల్లో కలర్ పిల్లోలో అందాలను దాచేసినా హాట్‌నెస్‌ను మాత్రం ఓవర్‌ లోడ్ చేసి మరి చూపించింది పాయల్‌ రాజ్‌పుత్‌‌. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ పిల్లో ఛాలెంజ్ ట్రెండ్ అవుతోంది. ఫారిన్ బ్యూటీస్ ఒంటి చుట్టూ పిల్లో చుట్టుకుని ఆ ఫోటోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తున్నారు. ఇండియాలో మాత్రం దీనికి పెద్దగా ప్రచారం లేదు. పాయల్ రాజ్‌పుత్ కారణంగా మన సెలబ్రిటీల్లో కూడా ఫారిన్లో పాపులర్ అయినట్లు ఈ #PillowChallenge పాపులర్ అయితే మరికొంతమంది హీరోయిన్లను దిండులో చూసే భాగ్యం చూపరులకు దక్కొచ్చు.

ఇకపోతే ఒకే ఒక్క సినిమాతో యూత్‌లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న పాయల్ రాజ్‌పుత్, టాలీవుడ్‌లో ఆ క్రేజ్‌కు తగ్గట్టుగా అవకాశాలు అందుకోలేకపోతోంది. ‘ఆర్ఎక్స్ 100’ సినిమాలో ఇందుగా పాయల్ చూపించిన నటన, ఒలికించిన గ్లామర్ మాస్ ఆడియెన్స్‌కు విపరీతంగా నచ్చేశాయి. అయితే ఆ సినిమాతో వచ్చిన క్రేజ్‌ను పాయల్ సరిగ్గా వాడుకోలేకపోయింది. టాలెంట్, గ్లామర్ రెండూ ఉన్నా, సరైన అవకాశాలు అందుకోలేక వెనకబడిన ఈ పంజాబీ బ్యూటీకి సరైన బ్రేక్ ఎప్పుడు వస్తుందో చూడాలి.


Advertisement

Recent Random Post:

9 PM | ETV Telugu News | 4th October “2024

Posted : October 4, 2024 at 10:28 pm IST by ManaTeluguMovies

9 PM | ETV Telugu News | 4th October “2024

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad