Advertisement

అతను చేస్తానన్నా.. గోపీ వద్దంటున్నాడట

Posted : April 20, 2020 at 2:34 pm IST by ManaTeluguMovies

తెలుగులో ‘శౌర్యం’ సినిమాతో దర్శకుడిగా మారాడు సినిమాటోగ్రాఫర్ శివ. ఆ సినిమా మంచి విజయం సాధించడంతో అతడి పేరు పక్కన ‘శౌర్యం’ స్థిరపడిపోయింది. ఆ తర్వాత అతను తెలుగులో తీసిన ‘శంఖం’, ‘దరువు’ ఆడలేదు. ఈ లోపు తమిళంలో ‘విక్రమార్కుడు’ రీమేక్ ‘సిరుత్తై’గా రీమేక్ చేసి హిట్ కొట్టాడు శివ.

ఆపై అతడికి అజిత్‌ నుంచి పిలుపొచ్చింది. వరుసగా అతడితో ‘వీరం’, ‘వేదాలం’, ‘వివేగం’, ‘విశ్వాసం’ లాంటి భారీ చిత్రాలు తీశాడు శివ. ఇందులో ‘వివేగం’ మినహాయిస్తే అన్నీ బ్లాక్ బస్టర్లే. ఇప్పుడు ఏకంగా సూపర్ స్టార్ రజనీకాంత్‌తో ‘అన్నాత్తె’ అనే మరో భారీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.

ఈ సినిమాలో శివ తొలి సినిమా హీరో గోపీచంద్ ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నట్లుగా ఈ మధ్య ప్రచారం జరిగింది. అతడిది నెగెటివ్ రోల్ అని కూడా అన్నారు. ఈ వార్త చాలా ఆసక్తికరంగా అనిపించింది.

కానీ ఇందులో నిజం ఏమీ లేదని అంటున్నాడు గోపీచంద్. రజనీ సినిమాలో నటిస్తున్నావా అంటూ చెన్నై నుంచి కూడా చాలా మంది స్నేహితులు ఫోన్ చేసి అడిగారని.. శివ, తాను స్నేహితులం కావడంతో ఈ ప్రచారం మొదలై ఉండొచ్చని గోపీ అన్నాడు.

‘శౌర్యం’, ‘శంఖం’ తర్వాత శివతో పని చేయలేకపోయానని.. ఐతే తాను ఎప్పుడు కోరితే అప్పుడొచ్చి సినిమా డైరెక్ట్ చేస్తానంటూ శివ చెబుతూనే ఉంటాడని.. కానీ ఇప్పుడు అతడికి తమిళంలో పెద్ద పెద్ద హీరోలతో సినిమాలు చేసే అవకాశాలు వస్తున్నాయని.. ఇది అతడి కెరీర్‌కు మంచిదనే ఉద్దేశంతో తనతో సినిమా చేయట్లేదని గోపీ చెప్పాడు. తర్వాత ఎప్పుడైనా తామిద్దరం కలిసి సినిమా చేయొచ్చని అన్నాడు.

ఇక తన కొత్త సినిమా ‘సీటీమార్’ గురించి చెబుతూ.. షూటింగ్ 50 శాతం పూర్తయిందని.. సెకండాఫ్ మొదలుపెడదామని అనుకుంటుండగా కరోనా వచ్చి బ్రేక్ వేసిందని.. ఇందులో తాను కబడ్డీ కోచ్‌గా నటిస్తున్నానని గోపీ చెప్పాడు.


Advertisement

Recent Random Post:

🔴LIVE : ABN MD Radhakrishna Big Debate With TDP MP Candidate Pemmasani Chandrasekhar

Posted : April 24, 2024 at 7:19 pm IST by ManaTeluguMovies

🔴LIVE : ABN MD Radhakrishna Big Debate With TDP MP Candidate Pemmasani Chandrasekhar

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement