Advertisement

వరుణ్ సినిమాలో ఉప్పీ.. కన్ఫర్మ్

Posted : April 27, 2020 at 1:59 pm IST by ManaTeluguMovies

కన్నడ స్టార్ హీరో ఉపేంద్రకు భీభత్సమైన మాస్ ఫాలోయింగ్ ఉంది. అతని ఫాలోయింగ్ కన్నడకే పరిమితమవ్వలేదు. తెలుగులో కూడా ఉపేంద్రకు మంచి గుర్తింపు ఉంది. 90లలో ఉపేంద్ర నటించిన కన్నడ సినిమాలు మన దగ్గర బాగానే ఆడాయి. అలాగే డైరెక్ట్ గా కొన్ని తెలుగు సినిమాల్లో కూడా ఉపేంద్ర సినిమాలు చేసాడు.

అప్పట్లో ఉపేంద్ర స్వీయ దర్శకత్వంలో వచ్చిన సూపర్ సినిమా కూడా ఇక్కడ సూపర్ హిట్ అయిన విషయం తెల్సిందే. అయితే కన్నడలో రెగ్యులర్ గా సినిమాలు చేసిన ఉపేంద్ర తెలుగులో మాత్రం చాలా సెలెక్టివ్ గా ఉన్నాడు. ఆ మధ్య సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో నటించిన ఉపేంద్ర మళ్ళీ తెలుగు సినిమాలు చేయలేదు. ఆయన స్థాయికి తెలుగు సినిమాలు రాకుండా ఉంటాయని మనం అనుకోలేం.

ఉపేంద్ర రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో దీని గురించి స్పందించాడు. సన్నాఫ్ సత్యమూర్తి తర్వాత తనకు అన్నీ విలన్ పాత్రలే ఆఫర్ చేస్తూ వచ్చారని, వరసగా విలన్ గా నటించడం కరెక్టా కాదా అన్న ఆలోచనలో పడి సినిమాలు ఒప్పుకోలేదని, అయితే ఇప్పుడు ఒక తెలుగు సినిమాలో నటించడానికి ఎస్ చెప్పినట్లు అధికారికంగా ప్రకటించాడు. వరుణ్ తేజ్ నటిస్తోన్న బాక్సింగ్ నేపధ్యమున్న సినిమాలో ఉపేంద్ర కీలకమైన పాత్రలో నటిస్తున్నట్లు తెలిసింది. అతని మాటల్ని బట్టి చూస్తే అది విలన్ పాత్ర కాదని తెలుస్తోంది. మరి అది ఎలాంటి పాత్రో తెలియాలంటే మరి కొద్దీ రోజులు ఎదురుచూడక తప్పదు.

కిరణ్ కొర్రపాటి ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. థమన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. వైజాగ్ లో ఈ చిత్రానికి సంబంధించిన తొలి షెడ్యూల్ పూర్తయింది.


Advertisement

Recent Random Post:

Extra Jabardasth Latest Promo – 10th May 2024 – Rashmi Gautam,Kushboo,Immanuel,Bullet Bhaskar

Posted : May 8, 2024 at 2:10 pm IST by ManaTeluguMovies

Extra Jabardasth Latest Promo – 10th May 2024 – Rashmi Gautam,Kushboo,Immanuel,Bullet Bhaskar

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement