ప్రముఖ స్టార్స్.. క్రికెటర్స్.. రాజకీయ నాయకుల బయోపిక్‌లు వరుసగా వస్తున్నాయి. ముఖ్యంగా క్రికెటర్స్ బయోపిక్కు మంచి స్పందన వస్తోంది. సచిన్, ధోనీ బయోపిక్‌లు సూపర్ హిట్ అయ్యాయి. ప్రస్తుతం కపిల్ దేవ్ బయోపిక్ ‘83’ విడుదలకు రెడీగా ఉంది. ఈ సమయంలోనే పాకిస్తాన్ మాజీ ఫేస్ బౌలర్ సోయబ్ అక్తర్ తన బయోపిక్ పై ఆసక్తి చూపిస్తున్నాడు. అయితే ఆయన బయోపిక్ ను పాకిస్తాన్లో కాకుండా ఇండియాలో తీస్తే బాగుంటుందని కూడా ఆయన అభిప్రాయం వ్యక్తం చేశాడు.
తన బయోపిక్ అంటూ తీస్తే బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ చేయాలని అక్తర్ అన్నాడు. నాకు సల్మాన్ ఖాన్ అంటే చాలా ఇష్టం. ఆయన నటనతో పాటు ఆయన వ్యక్తిత్వం కూడా నాకు చాలా ఇష్టం. ఆయన్ను ఒకానొక సందర్బంగా దుబాయిలో కలిశాను. ఆయనతో కలిసిన సందర్బం నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. సల్మాన్ కు నేను పెద్ద ఫ్యాన్ అంటూ తాజాగా ఒక ఇంటర్వ్యూలో అక్తర్ పేర్కొనడం చర్చనీయాంశం అయ్యింది.
ఇక సల్మాన్ బీయింగ్ హ్యామన్ పౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చారిటీ కార్యక్రమాలపై కూడా నాకు చాలా గౌరవం ఉందన్నాడు. వ్యక్తిగతంగా హీరోగా సల్మాన్ అంటే నాకు చాలా ఇష్టం కనుకే ఆయన నా బయోపిక్‌లో నటించాలని కోరుకుంటున్నాను అంటూ సోయబ్ అక్తర్ అన్నాడు. మరి పాకిస్తాన్ క్రికెటర్ బయోపిక్ ఇండియన్ స్క్రీన్‌పై సాధ్యమేనా అంటే అనుమానమే. మొదట సల్మాన్ అందుకు ఆసక్తి చూపించక పోవచ్చు అంటున్నారు.