Advertisement

కరోనా అలర్ట్‌: విజయనగరానికీ పాకిన వైరస్‌.!

Posted : May 7, 2020 at 3:09 pm IST by ManaTeluguMovies

ఇప్పటితో రాష్ట్రంలో కరనా సోకిన జిల్లాల సంఖ్య 13కి చేరింది. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అన్నిటినీ ‘శాతం’ లెక్కల్లో చెబుతుంది గనుక, కరోనా సోకిన జిల్లాలు ఆంధ్రప్రదేశ్‌లో 100 శాతం అన్న మాట. తాజాగా విజయనగరం జిల్లాకీ కరోనా వైరస్‌ సోకడంతో జిల్లా ప్రజానీకం తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. కొద్ది రోజుల క్రితమే శ్రీకాకుళం జిల్లా కూడా కరోనా లిస్ట్‌లో చేరిన విషయం విదితమే.

అంతకు ముందు వరకూ రాష్ట్రంలో మిగతా జిల్లాల్లో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనా, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు కరోనా వైరస్‌కి చాలా దూరంగా వున్నాయి. దాదాపు 40 రోజుల తర్వాత విజయనగరం జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసు నమోదవడమంటే, ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యంగానే చెప్పుకోవాల్సి వుంటుంది. ఎందుకంటే, లాక్‌డౌన్‌ తర్వాత.. జిల్లాల మధ్య రాకపోకలు నిలిచిపోయాక, విజయనగరం జిల్లాలోనూ.. శ్రీకాకుళం జిల్లాలోనూ కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు నమోదవడమేంటి.?

ఇంకోపక్క, విశాఖపట్నంలో కొద్ది రోజుల క్రితం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య చాలా తగ్గిపోయింది. మళ్ళీ ఇప్పుడక్కడ కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా విజయనగరం జిల్లాలో 3 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, విశాఖలో 7 కొత్త కేసులు నమోదయ్యాయి. శ్రీకాఉళం జిల్లాలో మాత్రం కొద్ది రోజులుగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాకపోవడం కాస్త ఊరట.

మొత్తం ఈ రోజు లెక్క చూస్తే, 56 కొత్త పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దాంతో మొత్తం కేసుల సంఖ్య 1833కి చేరుకుంది. 780 మంది కరోనా బాధితులు కోలుకోవడం కాస్త ఉపశమనం. 38 మంది ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరం. రాష్ట్రంలో ప్రస్తుతం 1015 యాక్టివ్‌ కేసులు వున్నాయి. కాగా, పొరుగు రాష్ట్రం తెలంగాణలో కేవలం 500 లోపే యాక్టివ్‌ కేసులు వుండడం.


Advertisement

Recent Random Post:

Roti Kapda Romance – Official Trailer | Bekkem Venugopal | Vikram Reddy | Srujan Kumar | Nov 22nd

Posted : October 31, 2024 at 2:07 pm IST by ManaTeluguMovies

Roti Kapda Romance – Official Trailer | Bekkem Venugopal | Vikram Reddy | Srujan Kumar | Nov 22nd

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad