Advertisement

అందరూ అక్కడికి వెళ్దామనే.. కాని కంటెంటే..

Posted : May 18, 2020 at 1:13 pm IST by ManaTeluguMovies

కోలీవుడ్ స్టార్లు రజినీ, కమల్, సూర్య, కార్తీ, విక్రమ్, ధనుష్, విశాల్‌‌లకు ఇక్కడ కూడా మంచి మార్కెట్ ఉంది. అందుకే తమిళ్‌తో పాటు తెలుగులో కూడా వాళ్ల సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. అయితే మరి మన హీరోల పరిస్థితి అలా కాదు.తమిళ్‌ హీరోల్లా మనవాళ్లు కూడా కోలీవుడ్‌లో మార్కెట్ పెంచుకోవాలని చాలాసార్లు ప్రయత్నించారు. అయితే ఎవ్వరూ పెద్దగా సక్సెస్ కాలేకపోయారు. ఇప్పుడు మరో యంగ్ హీరో కూడా కోలీవుడ్‌లో సత్తా చాటుతానంటున్నాడు.

ఎన్టీఆర్ ‘శక్తి’ సినిమాతో, మహేష్ బాబు ‘స్పైడర్’ సినిమాతో కోలీవుడ్‌లో గ్రాండ్‌గా ఎంట్రీ ఇవ్వాలని భావించారు. అయితే ఈ రెండు సినిమాలు అక్కడా, ఇక్కడా డిజాస్టర్ ఫలితాన్నే అందించాయి. కోలీవుడ్ డైరెక్టర్ మురగదాస్‌తో చేసిన ‘స్పైడర్’ ఫ్లాప్ అయినా మహేష్ నటించిన ‘బ్రహ్మోత్సవం’ వంటి సినిమాలను తమిళ్‌లో డబ్ చేసి రిలీజ్ చేశారు. అయినా టాలీవుడ్ సూపర్‌స్టార్‌కి పెద్దగా ఒరిగిందేమీ లేదు. కారణం కంటెంట్.

కోలీవుడ్‌లో స్టార్ హీరోలు కూడా స్ట్రాంగ్ కంటెంట్‌ను నమ్ముకుని సినిమాలు తీస్తారు. కానీ మనవాళ్లు ఫ్యానిజం ముసుగులో పడి, ప్రయోగాలు చేయడానికి పెద్దగా సాహసం చేయరు. తెలుగులో విడుదలయ్యే సినిమాల్లో నూటికి తొంభై సినిమాలు రొటీన్ మాస్ ఫార్ములా, లేదా రొమాంటిక్ లవ్ స్టోరీస్‌తో తెరకెక్కేవే! అందుకే టాలీవుడ్ హీరోలు, కోలీవుడ్‌లో మార్కెట్ పెంచుకోలేకపోతున్నారు. అయితే యంగ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ కూడా కోలీవుడ్‌లో సత్తాచాటుతానని చెబుతున్నాడు.

‘నాకు చిన్నప్పటి నుంచి తమిళ్ భాష, అక్కడి కల్చర్ చాలా ఇష్టం. నేను చెన్నైలోనే పుట్టడం వల్ల అంత ఇష్టం వచ్చిందేమో. త్వరలో తమిళ్‌లో నేరుగా సినిమా చేసేందుకు ఎదురుచూస్తున్నా’ అంటూ చెప్పుకొచ్చాడు రామ్ పోతినేని. హిందీ డబ్ వెర్షన్లతో యూట్యూబ్‌తో రికార్డు కొట్టిన రామ్, ఆ దెబ్బతో తన క్రేజ్ అమాంతం పెరిగిపోయిందని ఊహాల్లో ఉన్నట్టున్నాడు. కానీ కంటెంట్ లేకపోతే ఎనర్జీ ఎంతున్నా, కోలీవుడ్‌లో పప్పులు ఉడకవని ఈ కుర్రహీరో తెలుసుకుంటే మంచిదని అంటున్నారు టాలీవుడ్ జనాలు.


Advertisement

Recent Random Post:

ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ చెల్లదంటూ క్యాట్‌ తీర్పు | AB Venkateswara Rao Suspension Dismissed

Posted : May 9, 2024 at 1:07 pm IST by ManaTeluguMovies

ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ చెల్లదంటూ క్యాట్‌ తీర్పు | AB Venkateswara Rao Suspension Dismissed

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement