Advertisement

లేట్ అయినా ఆర్ఆర్ఆర్ థ్రిల్ చేస్తుంది – ఎన్.టి.ఆర్

Posted : May 18, 2020 at 6:34 pm IST by ManaTeluguMovies

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ అభిమానులను పూర్తిగా నిరాశపరిచే వార్త ఈ రోజు ఉదయం ఆర్ఆర్ఆర్ టీం అనౌన్స్ చేసింది. అదే ఎన్.టి.ఆర్ బర్త్ డే రోజున ఎలాంటి పోస్టర్ కానీ, వీడియో టీజర్ కానీ రిలీజ్ చేయడం లేదని. దీంతో అభిమానులంతా చాలా బాధకి లోనయ్యారు. వారిని కాస్త చీరప్ చేయడం కోసం ఎన్.టి.ఆర్ ఓ రకమైన శుభవార్తని తెలిపారు.

ముందుగా కరోనా మహమ్మారి కారణముగా ప్రతి ఏడాదిలా ఈ ఏడాది ఎలాంటి సెలబ్రేషన్స్ చేయకుండా ఇంటి వద్దే ఉంటూ అందరూ క్షేమంగా ఉండాలని కోరారు. అలాగే బర్త్ డే కానుకగా ఎలాంటి టీజర్/ పోస్టర్ రావడం లేదనేది మీకు నిరాశని కలిగించి ఉంటుందో నేను అర్థం చేసుకోగలను. కానీ ఆర్ఆర్ఆర్ ఫైనల్ అవుట్ ఫుట్ మాత్రం మిమ్మల్ని అందరినీ కచ్చితంగా థ్రిల్ చేస్తుందని మాత్రం చెప్పగలను అని తారక్ తన ట్విట్టర్ ద్వారా మెసేజ్ పంపాడు.

దీంతో అభిమానులు ఆ నిరాశ నుంచి కాస్త తేరుకొని, టీజర్ తో కాదు సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేద్దామని చీరప్ అవుతున్నారు.


Advertisement

Recent Random Post:

Posani Krishna Murali Sensational Comments On Chiranjeevi and Pawan Kalyan

Posted : May 8, 2024 at 6:31 pm IST by ManaTeluguMovies

Posani Krishna Murali Sensational Comments On Chiranjeevi and Pawan Kalyan

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement