Advertisement

ప్యాసింజర్ రైళ్లు రెడీ.. ఎప్పట్నుంచి అంటే?

Posted : May 20, 2020 at 2:51 pm IST by ManaTeluguMovies

కరోనా కారణంగా దేశవ్యాప్తంగా ఆగిపోయిన ప్రజా రవాణాను పునరుద్ధరించే దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో బస్సులు పున:ప్రారంభం కాగా.. వలస కార్మికుల కోసం కొన్ని వారాల కిందటే రైళ్లను నడుపుతున్న సంగతి తెలిసిందే. వీటితో పాటు రెగ్యులర్ ప్యాసింజర్ రైళ్లనూ నడపడానికి రైల్వే శాఖ సన్నాహాలు చేస్తోంది.

జూన్ 1 నుంచి ప్యాసింజర్ రైళ్లు పున:ప్రారంభం అవుతాయని కేంద్ర రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్ వెల్లడించారు. 200 నాన్ ఏసీ సెకండ్ క్లాస్ రైళ్లను తొలి దశలో మొదలుపెట్టనున్నట్లు తెలిపారు.

ప్రయాణికులు ఈ రైళ్ల టికెట్లను ఆన్ లైన్లో మాత్రమే బుక్ చేసుకోవాలని.. దేశంలోని ప్రతి ఒక్కరికీ ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయని ఆయన చెప్పారు. లాక్ డౌన్ కారణంగా మార్చి 25 నుంచి రైళ్లు ఆగిపోయిన సంగతి తెలిసిందే.

త్వరలోనే ఈ ప్యాసింజర్ రైళ్లకు సంబంధించి టైం టేబుల్ కూడా విడుదల చేస్తామని రైల్వే శాఖ ప్రకటించింది. ఆన్ లైన్ ద్వారా రిజర్వేషన్ చేయించుకున్న వారికి మాత్రమే ఈ 200 రైళ్లలో ప్రయాణానికి అనుమతి ఇవ్వనుండగా.. రైల్వే కౌంటర్ల దగ్గర వీటికి టికెట్ బుకింగ్ అవకాశం లేదని రైల్వే శాఖ ప్రకటించింది.

స్టేషన్లలో టికెట్ల కౌంటర్లు తెరిస్తే భౌతిక దూరం పాటించడం కష్టమవుతుందని.. కరోనా వ్యాప్తి ప్రమాదం ఉంటుందని అందుకు అవకాశం లేకుండా చూస్తున్నారు. ఈ రైళ్లలో బోర్డింగ్, సీటింగ్ విషయంలోనూ షరతులుంటాయి. భౌతిక దూరం పాటిస్తూ రైలు ఎక్కాలి. ప్రయాణికుల మధ్య దూరం ఉండేలా సీట్ల ఏర్పాటు కూడా కొంచెం భిన్నంగా ఉండబోతోంది. దశల వారీగా రైళ్ల సంఖ్యను పెంచి కొన్ని నెలల్లో రవాణాను పూర్తి స్థాయిలో పునరుద్ధరించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.


Advertisement

Recent Random Post:

Posani Krishna Murali | పోసాని పాత లెక్కలు తేలుస్తారా..? వదిలేస్తారా..? | OTR

Posted : November 22, 2024 at 10:28 pm IST by ManaTeluguMovies

Posani Krishna Murali | పోసాని పాత లెక్కలు తేలుస్తారా..? వదిలేస్తారా..? | OTR

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad