సామాన్యులు సోషల్ మీడియాలో ఏం పోస్ట్ చేసినా, ఎలాంటి కామెంట్స్ చేసినా కూడా పెద్దగా పట్టించుకోరు. కాని సెలబ్రెటీలు మాత్రం ఏ చిన్న పదం ట్వీట్ చేసినా కూడా చాలా పెద్ద ఎత్తున చర్చకు తెర తీస్తుందనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే స్టార్స్.. రాజకీయ నాయకు సోషల్ మీడియాలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. తమ అభిప్రాయాలు కూడా ఇతరులను నొప్పిస్తాయా అనే విషయంలో ఆలోచించి మరీ స్పందించాల్సి ఉంటుంది. తాజాగా నాగబాబు చేసిన ట్వీట్స్ సోషల్ మీడియాలో చర్చనీయాంశం అయ్యాయి.
ట్విట్టర్ లో నాగబాబు నిన్న గాడ్సే దేవ భక్తి గురించి మాట్లాడుతూ గొప్ప వ్యక్తి అంటూ అబివర్ణించే ప్రయత్నం చేవాడు. గాంధీని చంపేసిన వ్యక్తి గురించి ఇలా మాట్లాడటం ఏంటీ అంటూ నాగబాబుపై నెటిజన్స్ చాలా మంది దుమ్మెత్తి పోస్తున్నారు. ఈ సమయంలోనే కొందరు నాగబాబును సమర్ధించారు. తనపై వస్తున్న విమర్శల కారణంగా నాగబాబు స్పందించాడు. తన ట్వీట్ గాంధీని అవమానించడం కాదంటూ ట్విట్టర్ లో పేర్కొన్నాడు.
దయచేసి అందరూ నన్ను అర్థం చేసుకోండి. నేను నాధురాం గురించి ఇచ్చిన ట్వీట్ లో నాధురాం చేసిన నేరాన్ని సమర్ధించలేదు.నాధురాం వెర్షన్ కూడా జనానికి తెలియాలి అని మాత్రమే అన్నాను.నాకు మహాత్మ గాంధీ అంటే నాకు చాలా గౌరవం.ఇన్ఫాక్ట్ నన్ను విమర్శించే వల్లకన్నా నాకు ఆయనంటే చాలా గౌరవం అంటూ ట్వీట్ చేశాడు.
నాగబాబు పబ్లిసిటీ కోసమే ఇలా వివాదాస్పద అంశాలను నెత్తికి ఎత్తుకోవడం, ఆ పై వివరణ ఇవ్వడం చేస్తున్నాడంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు మెగా బ్రదర్స్ వార్నింగ్ ఇవ్వడం వల్లే నాగబాబు నేడు మళ్లీ వివరణ ట్వీట్ చేశాడంటూ కొందరు అబిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా నాగబాబు ట్వీట్స్ గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో చర్చనీయాంశం అవుతున్నాయి.