Advertisement

కార్నర్ అయిపోయిన మెగా క్యాంప్

Posted : May 30, 2020 at 1:03 pm IST by ManaTeluguMovies

నోరా వీపుకు తేకే అన్నది వెనకటికి పెద్దల మాట..నోరు బాగుంటే ఊరు బాగుంటుందన్నది మరో మాట. ఈ రెండు మాటలు పాపం మెగా యాక్టర్ నాగబాబుకు తెలియదు అనుకోవాలి. అలాతెలిసి వుంటే ఈ అనవసరపు ఆవేశం ఆయనకు వుండేది కాదు. కానీ ఆవేశం ఎప్పుడు అనర్థదాయకమేగా. ఇప్పుడూ అదే జరిగింది.

మెగాస్టార్ చిరంజీవి చాలా ప్లాన్డ్ గా కష్టపడి, ఇండస్ట్రీ పెద్ద అనే ఇమేజ్ తెచ్చుకునే ప్రయత్నం చేసి, సిసిసి పెట్టి, కిందా మీదా పడి, అంతా అనుకూలంగా చేసుకుంటూవస్తే, ఒక్క దెబ్బకి మొత్తం మటాష్ చేసేసారు.

మెగాస్టార్ చిరంజీవి ఓ విభిన్న తరహా మనిషి. వీలయినంత వరకు కాంట్రావర్సీలకు దూరంగా వుండాలనుకుంటారు. వీలయినంత వరకు అందరి వాడిలా వుండాలనుకుంటారు. గట్టిగా నలుగురు నాలుగు విధాలుగా మాట్లాడుకుంటారు. అనుకుంటే చాలు. ఆయన సైలంట్ అయిపోతారు.

ఇప్పుడు అదే జరిగే పరిస్థితి. బాలయ్య మీద వున్నట్లుండి ఆవేశపడిపోయారు నాగబాబు. బాలయ్య మాట జారి వుండొచ్చు. కానీ ఇక్కడ నాగబాబు గమనించాల్సింది అది ఒక్కటే కాదు, తను రెచ్చిపోతే, అన్న మెగాస్టార్ ఏమనుకుంటారు? ఆయన పరిస్థితి ఏమవుతుంది? అన్నది. అది గమనించలేదు. ఇప్పుడేమయింది. సీన్ రివర్స్ అయిపోయింది. బాలయ్యకు భయంకరంగా మద్దతు లభిస్తోంది. ఒక్కరంటే ఒక్కరు నాగబాబు కు మద్దతుగా మాట్లాడుతున్న దాఖలా కనిపించడం లేదు.

ఓ చిన్న డైరక్టర్ వీడియో లో మాటల తూటాలు విసిరాడు. ఇలా ఒకళ్లు కాదు అనేక మంది విడియోలు, ప్రకటనలు సోషల్ మీడియాలోకి వదిలారు. అందరూ మెగాస్టార్ ను తప్పు పట్టేవారే.

అసలు ఇంట్లో సమావేశం పెట్టడం ఏమిటి?

డిజాస్టర్లు ఇచ్చి, సినిమాలు ఆపేసి ఇంట్లో కూర్చున్న దర్శకుడిని దగ్గరకు తీయడం ఏమిటి? సిఎమ్ దగ్గరకు తీసుకెళ్లడం ఏమిటి?

మంత్రి తలసాని ట్రస్ట్ పంపిణీ చేసిన సరుకుల సంచీ మీద కేసిఆర్ ఫొటోతో పాటు మెగాస్టార్ చిత్రం కూడా దేనికి?

ఇలాంటి అనేక ప్రశ్నలు ఇప్పుడు ఇండస్ట్రీలో డిస్కషన్ పాయింట్లుగా మారాయి. ఇదే సమయంలో మెగాక్యాంప్ కు మద్దతుగా రంగంలోకి దిగిన వారు ఒక్కరు కనిపించడం లేదు. చిరంజీవి దగ్గరకు తీసిన కొరటాల శివ, రాజమౌళి, సి కళ్యాణ్, కేఎస్ రామారావు, జెమిని కిరణ్ ఇలా అనేక మందిలో ఒక్కరంటే ఒక్కరు కూడా బాలయ్య వాఖ్యలు ఖండించకపోవచ్చు కానీ, కనీసం మెగాస్టార్ కు మద్దుతుగా ఓ మాట కూడా మాట్లాడే పరిస్థితి లేదు.

బాలయ్య తరపున ఎవరో ఒకరు చోటా మోటా జనాలు మాట్లాడుతున్నట్లే, మెగా క్యాంప్ తరపున మాట్లాడేవరే కనిపించడం లేదు. దీంతో ప్రో బాలయ్య వాయిస్ వినిపిస్తోంది. మెగా క్యాంప్ కార్నర్ అయిపోయింది.


Advertisement

Recent Random Post:

AP Land Titling Act : రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్న యాక్ట్..! |

Posted : May 6, 2024 at 1:07 pm IST by ManaTeluguMovies

AP Land Titling Act : రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్న యాక్ట్..! |

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement