Advertisement

పుకార్లన్నింటికి చెక్‌ పెట్టేందుకు పెళ్లి

Posted : June 2, 2020 at 7:03 pm IST by ManaTeluguMovies

బాలీవుడ్‌ హీరోయిన్స్‌ ఇద్దరు ముగ్గురిని ప్రేమించడం ఆ తర్వాత బ్రేకప్‌ అవ్వడం చాలా కామన్‌ విషయాలు. అయితే సౌత్‌ లో మాత్రం హీరోయిన్స్‌ ఎక్కువ లవ్‌ అఫైర్స్‌ను కలిగి ఉండరు. ఒక్కరు ఇద్దరితోనే ప్రేమ వ్యవహారం సాగుతుంది. కాని నయనతార మాత్రం మూడు ప్రేమ వ్యవహారాలు సాగించింది. మొదటి రెండు ఫెయిల్యూర్‌ అయ్యారు. శింబుతో ప్రేమ ఆరంభంలోనే వాడిపోగా, ప్రభుదేవాతో ప్రేమ వ్యవహారం పెళ్లి వరకు వచ్చి బ్రేకప్‌ అయ్యింది.

ఇక ప్రస్తుతం ఈమె దర్శకుడు విఘ్నేష్‌ శివన్‌తో ప్రేమలో ఉంది. వీరిద్దరు కూడా విడిపోయారు అంటూ కొన్ని సార్లు, వీరిద్దరు గొడవ పడుతున్నారు అంటూ కొన్ని సార్లు రకరకాలుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ పుకార్లకు చెక్‌ పెట్టేందుకు ఇద్దరు పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చారట. గత కొన్నాళ్లుగా వీరిద్దరు కూడా సహజీవనం సాగిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. సినిమాలతో బిజీగా ఉండటమే కాకుండా క్రేజ్‌ ఉన్న సమయంలో పెళ్లి చేసుకుంటే ఆఫర్లు తగ్గుతాయనే ఉద్దేశ్యంతో నయన్‌ పెళ్లికి వెనుకంజ వేసింది.

ప్రస్తుతం నయనతార పెళ్లికి రెడీ అయ్యింది. హీరోయిన్‌ గా ఇప్పటికి వరుసగా సినిమాలు చేస్తున్నా కూడా ఈమె పెళ్లికి సిద్దం అంది. ఈ ఏడాది చివరి వరకు వీరిద్దరి ప్రేమ వివాహం పెద్దల సమక్షంలో వైభవంగా జరుగబోతుంది. అందుకు సంబంధించిన చర్చలు ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. త్వరలోనే పెళ్లికి సంబంధించిన అధికారిక ప్రకటన విఘ్నేష్‌ శివన్‌ లేదా నయనతార నుండి వస్తుందని తమిళ సినీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది.


Advertisement

Recent Random Post:

Vizag: కాసేపట్లో రుషికొండ ప్యాలెస్ కు CM Chandrababu | Special Report

Posted : November 2, 2024 at 3:21 pm IST by ManaTeluguMovies

Vizag: కాసేపట్లో రుషికొండ ప్యాలెస్ కు CM Chandrababu | Special Report

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad