ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు తెలుగు సినిమాల షూటింగులకు అనుమతులు ఇచ్చాయి. ఇది జరిగి కొన్ని రోజులు అవుతున్నా చిన్న చితకా సినిమాలు తప్ప మీడియం బడ్జెట్, బడా సినిమాలు ఇంకా షూటింగ్ లు మొదలుపెట్టలేదు. దీనికి కారణం హీరోలు, నటీనటులు షూటింగ్ లకు రావడానికి నిరాకరిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో షూటింగ్ లకు రావడం అంత శ్రేయస్కరం కాదని వారు భావిస్తున్నారు. మహేష్, ప్రభాస్, అల్లు అర్జున్.. ఇలా ఒకరని కాదు దాదాపుగా అందరిదీ ఇదే ఆలోచన. మరో రెండు నెలలు వేచి చూసి అప్పుడు మొదలుపెట్టుకోవచ్చు కదా అనుకుంటున్నారు.
హీరోలే ఇలా ఆలోచిస్తున్నారు అంటే హీరోయిన్లు కూడా ఇదే రూట్ లో వెళుతున్నారు. ప్రస్తుతం కరోనా వైరస్ ఉధృతమవుతోంది. మనం జాగ్రత్తలు తీసుకుని షూటింగ్ లో పాల్గొన్నా మిగతా వారు కూడా అలాంటి జాగ్రత్తలు తీసుకుంటారన్న గ్యారంటీ లేదు కదా. అందుకే మన జాగ్రత్తలో మనం ఉండాలి. అందుకే షూటింగ్ లకు రిస్క్ తీసుకోవడం నాకు ఇష్టం లేదు అని ఖరాఖండీగా చెప్పేసింది కీర్తి సురేష్.
ఇలా హీరోలు, హీరోయిన్లు షూటింగ్ లకు రావడానికి ఇష్టం చూపించకపోతే షూటింగ్ లు మొదలయ్యేది ఎప్పుడు?