టాలెంటెడ్ దర్శకుడు తేజ సీత సినిమాతో ప్లాప్ కొట్టినా కొంత బ్రేక్ తీసుకుని వరసగా రెండు సినిమాలను ప్రకటించిన విషయం తెల్సిందే. అందులో ఒకటి గోపీచంద్ హీరోగా అలివేలు వెంకట రమణ కాగా రెండోది రానా ప్రధాన పాత్రలో రాక్షసరాజు రావణాసురుడు. ఈ రెండు సినిమాలను ప్రకటించి ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాక లాక్ డౌన్ విధించిన సంగతి తెల్సిందే. అయితే రీసెంట్ గా తెలంగాణ ప్రభుత్వం షూటింగ్ లకు అనుమతులు ఇచ్చిన విషయం తెల్సిందే.
అయితే కొంత మంది ఇంకా షూటింగ్ లకు రావడానికి ఇంకా ఆలోచిస్తుండగా తేజ మాత్రం సైలెంట్ గా తన సినిమా షూటింగ్ మొదలుపెట్టేశాడు. అలివేలు వెంకట రమణ సినిమా షూటింగ్ ను మొదలుపెట్టడమే కాకుండా మొదటి షెడ్యూల్ ను కూడా పూర్తి చేసేసాడు.
అయితే ఈ మొదటి షెడ్యూల్ లో బేసిక్ సీన్స్ కొన్ని తీశారు. రెండో షెడ్యూల్ నుండి గోపీచంద్, కాజల్ షూటింగ్ లో పాల్గొననున్నారట. నిజ జీవిత సంఘటనలను బేస్ గా చేసుకుని అల్లిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కనుంది. త్వరలోనే సెకండ్ షెడ్యూల్ మొదలుకానుంది.