Advertisement

సుశాంత్‌లో ఈ క్వాలిటీ యునీక్

Posted : June 17, 2020 at 4:23 pm IST by ManaTeluguMovies

ఇంటర్నేషనల్ స్పేస్ యూనివర్శిటీ.. షార్ట్‌గా చెప్పాలంటే ఐఎస్‌యు. యూరప్ దేశం ఫ్రాన్స్ కేంద్రంగా పని చేస్తుంది. అంతరిక్షంలో పరిశోధనలపై విస్తృతంగా పని చేసే సంస్థ ఇది. ఆ సంస్థ బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య గురించి తెలిసి అతడికి సంతాపం ప్రకటిస్తూ ఒక నోట్ రిలీజ్ చేసింది.

హిందీ సినిమాలు చేసుకునే నటుడికి ఫ్రాన్స్‌లో ఉన్న స్పేస్ యూనివర్శిటీ ఇలా నివాళి అర్పించడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఇందుకు కారణం లేకపోలేదు. సుశాంత్‌కు సైన్స్ మీద విపరీతమైన ఆసక్తి ఉంది. అంతరిక్షానికి సంబంధించిన విషయాలంటే అతడికి మరీ ఆసక్తి. అతడి సోషల్ మీడియా అకౌంట్లను చూస్తే స్పేస్‌కు సంబంధించిన పోస్టులు చాలా కనిపిస్తాయి. అతడికి ఆ అంశంలో లోతైన పరిజ్ఞానం ఉందని ఆ పోస్టులు చదివితే అర్థమవుతుంది.

చాలామందికి తెలియని విషయం ఏంటంటే.. సుశాంత్ అంతరిక్షంలో స్థలం కూడా కొన్నాడు. భారతీయ ఫిలిం సెలబ్రెటీల్లో స్పేస్‌లో స్థలం కొన్న ఏకైక వ్యక్తి అతనే. తన జీవితంలో సుశాంత్ నెరవేర్చుకోవాలనుకున్న 50 కలల్లో అంతరిక్ష యానం కూడా ఒకటి కావడం విశేషం. అతను పైన చెప్పుకున్న ‘ఇంటర్నేషనల్ స్పేస్ యూనివర్శిటీ’తో తరచుగా టచ్‌లోకి వెళ్లేవాడు. అక్కడి పరిశోధనల గురించి తెలుసుకునేవాడు. అతడి ఈ ఆసక్తి గురించి ట్రిబ్యూట్ నోట్‌లో ప్రత్యేకంగా ప్రస్తావించారు కూడా. ఇంకో విశేషం ఏంటంటే.. సుశాంత్ స్పేస్ నేపథ్యంలో ఒక భారీ సినిమా కూడా చేయాలనుకున్నాడు.

ఇందుకోసం ఆస్ట్రోనాట్ అవతారంలోకి మారి అంతరిక్ష యానం చేసిన శాస్త్రవేత్తలతో కలిసి కొంత శిక్షణ కూడా తీసుకున్నాడు. ఆ సినిమాను ఓ పెద్ద సంస్థతో కలిసి తనే ప్రొడ్యూస్ చేయాలని కూడా అనుకున్నాడు. 2017లో ఈ ప్రాజెక్టు మీద అతను సీరియస్‌గా పని చేశాడు కూడా. కానీ అది కార్యరూపం దాల్చలేదు. ఇలాంటి యునీక్ క్వాలిటీస్ ఉన్న నటుడు ఇలా అర్ధంతరంగా తనువు చాలించడం విచారకరం.


Advertisement

Recent Random Post:

Bloody Beggar – Trailer (Telugu) | Kavin | Nelson Dilipkumar | Sivabalan Muthukumar | Jen Martin

Posted : November 4, 2024 at 7:03 pm IST by ManaTeluguMovies

Bloody Beggar – Trailer (Telugu) | Kavin | Nelson Dilipkumar | Sivabalan Muthukumar | Jen Martin

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
Advertisement
728x90 Ad