Advertisement

మెగా ఫ్యామిలీ నుండి ఈయన కూడా ఎంట్రీ ఇవ్వడం ఖాయమా?

Posted : June 19, 2020 at 8:42 pm IST by ManaTeluguMovies

మెగా ఫ్యామిలీ నుండి చిరంజీవి తర్వాత ఇప్పటి వరకు ఎంత మంది హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు అంటే ఠక్కున చెప్పలేని పరిస్థితి. మెగా ఫ్యాన్స్‌ కూడా వెంటనే తడుముకోకుండా ఎంత మంది వారి పేర్లు ఏంటీ అంటే చెప్పలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే అంత మంది హీరోలు ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుండి వచ్చేశారు. ఇంకా వచ్చేందుకు రెడీ అవుతున్నారు. త్వరలో వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా ఉప్పెన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆ తర్వాత కూడా కొందరు హీరోలు వస్తారని మెగా కుటుంబ సభ్యులు అంటున్నారు.

ఇక నిహారిక పెళ్లి ఫిక్స్‌ అయ్యింది కనుక ఆమె భర్త కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. బిట్స్‌పిలానీ లో ఎడ్యుకేషన్‌ పూర్తి చేసిన చైతన్య ను తాజాగా నిహారిక పరిచయం చేసింది. నిహారిక పరిచయం చేసిన చైతన్య లుక్‌ అదిరి పోయింది. ప్రస్తుతం మెగా ఫ్యామిలీ నుండి హీరోలుగా ఎంట్రీ ఇచ్చి సక్సెస్‌ల కోసం కష్టపడుతున్న పలువురు హీరోల కంటే చైతన్య లుక్‌ చాలా బాగుందని, హీరోగా సరిగ్గా సూట్‌ అయ్యేలా చైతన్య ఉన్నాడు అంటూ మెగా ఫ్యాన్స్‌ అప్పుడే ఒడ్డు పొడువు లెక్కలు వేసుకుంటున్నారు.

ఇండస్ట్రీలో నిహారిక హీరోయిన్‌గా రాణించాలని చాలా ప్రయత్నాలు చేసింది. కాని ఆమె కొన్ని కారణాల వల్ల ఇండస్ట్రీలో స్టార్‌డం సంపాదించలేక పోయింది. తాను సంపాదించలేక పోయిన స్టార్‌డంను తన భర్తకు కట్టబెట్టే అవకాశాలు నిహారికకు ఉన్నాయి. పెదనాన్న చిరంజీవి అండదండలు ఉంటే చైతన్యను స్టార్‌ హీరోగా మారగలడు. చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్‌ దేవ్‌ హీరోగా పరిచయం అయిన విషయం తెల్సిందే. అలాగే నాగబాబుకు అల్లుడు కాబోతున్న చైతన్య కూడా ఖచ్చితంగా మామల ప్రోత్సాహంతో టాలీవుడ్‌ ప్రేక్షకుల ముందుకు రావడం కన్ఫర్మ్‌ అంటున్నారు. మరి చైతన్యకు ఆ ఇంట్రెస్ట్‌ ఉందా లేదా అనేది కాలమే నిర్ణయించాలి.


Advertisement

Recent Random Post:

Supreme Court Tough Questions to TDP Govt Lawyer | Tirumala Laddu Controversy |

Posted : September 30, 2024 at 7:55 pm IST by ManaTeluguMovies

Supreme Court Tough Questions to TDP Govt Lawyer | Tirumala Laddu Controversy |

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad