Advertisement

బండ్ల గణేష్ కు కరోనా పాజిటివ్

Posted : June 19, 2020 at 9:49 pm IST by ManaTeluguMovies

నిర్మాత, పారిశ్రామిక వేత్త బండ్ల గణేష్ కు కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తోంది. నిజానికి ఎటువంటి లక్షణాలు లేకపోయినా, ఎందుకో సందేహం వచ్చి టెస్ట్ చేయించుకున్నట్లు, అందులో పాజిటివ్ వచ్చినట్లు విశ్వసనీయ వర్గాల బోగట్టా. దాంతో బండ్ల భార్య పిల్లలకు కూడా పరీక్షలు నిర్వహించినట్లు తెలుస్తోంది. వాటి ఫలితాల ఇంకా రావాల్సి వుంది.

ఇధిలా వుంటే బండ్ల గణేష్ వున్న గేటెడ్ కమ్యూనిటీలోనే హీరో నాగశౌర్య ఫ్యామిలీ, కళామందిర్ కళ్యాణ్ ఫ్యామిలీ లాంటి ప్రముఖులు వున్నారు. ఫిల్మ్ నగర్ డౌన్ లో ఈ గేటెడ్ కమ్యూనిటీ వుంది. బండ్ల గణేష్ నిత్యం షాద్ నగర్ పౌల్ట్రీ ఫారమ్ కు వెళ్లి వస్తుంటారు. అలాగే ఆయన తన బిజినెస్ పనుల మీద ఎక్కువగా తిరుగుతూ వుంటారు.

ఇటీవల బండ్ల ఎవరు ఎవరిని కలిసారు అన్నది ట్రేస్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే గేటెడ్ కమ్యూనిటీలో మిగిలిన వారికి కూడా పరిక్షలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై బండ్ల గణేష్ ను ప్రశ్నించగా, తనకు ఏ పాజిటివ్ లేదని, తన ఆరోగ్యం బాగానే వుందని అన్నారు.


Advertisement

Recent Random Post:

Balineni Srinivas Reddy : జనసేనకు బాలినేని తలనొప్పిగా మారుతాడా..?

Posted : September 20, 2024 at 12:07 pm IST by ManaTeluguMovies

Balineni Srinivas Reddy : జనసేనకు బాలినేని తలనొప్పిగా మారుతాడా..?

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad