Advertisement

సోనమ్ కపూర్ కు తాకిన నెపోటిజం సెగ

Posted : June 24, 2020 at 4:03 pm IST by ManaTeluguMovies

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య వ్యవహారం బాలీవుడ్ లో చాలా మందిని ఇబ్బంది పెడుతోంది. సల్మాన్ ఖాన్, కరణ్ జోహార్ లను ఈ విషయంలో ఏకిపడేసిన నెటిజన్లు తాజాగా హీరోయిన్ల మీద తమ దృష్టిని మళ్లించారు. ఇండస్ట్రీలో ఎవరో ఒకరి సపోర్ట్ తో ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉండి సినిమాలు చేస్తున్న వారిని ఇప్పుడు సోషల్ మీడియాలో విడిచిపెట్టట్లేదు. ఈ నెగటివిటీ తట్టుకోలేక బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా తన ట్విట్టర్ అకౌంట్ ను డిజేబుల్ చేసుకున్న విషయం తెల్సిందే. తాజాగా మరో బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ కు కూడా ఈ నెపోటిజం సెగ అంటుకుంది.

ఇటీవలే వచ్చిన ఫాథర్స్ డే రోజున చాలా మంది స్టార్ కిడ్స్ తమ నాన్నల గురించి ఓపెన్ గా చెప్పుకోవడానికి ఇబ్బంది పడ్డారు. ఎక్కడ ఏమంటే నెపోటిజం మళ్ళీ తెరపైకి వస్తుందోనని. అయితే సోనమ్ కపూర్ మాత్రం ధైర్యంగానే పోస్ట్ పెట్టింది. తన తండ్రి లేకపోతే తాను ఈరోజు ఈ స్థాయిలో ఉండేదాన్ని కాదని తెలిపింది. ఇక సోనమ్ కపూర్ ను టార్గెట్ చేస్తూ నెటిజన్లు చేస్తున్న దండయాత్రకు కామెంట్స్ ను డిజేబుల్ చేసి ఫుల్ స్టాప్ పెట్టింది సోనమ్.

నీ తండ్రి లేకపోతే నువ్వు సహాయనటిగా కూడా పనికి రావు అంటూ చాలా మంది ఆమెను టార్గెట్ చేసారు. సో కామెంట్స్ ను డిజేబుల్ చేసింది. ఇకపై ఎవరూ కూడా ఆమె పోస్ట్స్ కు కామెంట్స్ పెట్టలేరు. సోనమ్ అనే కాకుండా స్టార్ కిడ్స్ అందరికీ సోషల్ మీడియాలో ఇబ్బంది ఎదురవుతోంది. అలియా భట్ కు లక్షల్లో ఫాలోయర్స్ తగ్గిపోతున్నారు.


Advertisement

Recent Random Post:

Tiragabadara Saami Trailer | Raj Tharun, Malvi Malhotra | Ravi Kumar | JB | Shiva Kumar

Posted : July 2, 2024 at 6:38 pm IST by ManaTeluguMovies

Tiragabadara Saami Trailer | Raj Tharun, Malvi Malhotra | Ravi Kumar | JB | Shiva Kumar

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement