Advertisement

‘ఇంటింటి గృహలక్ష్మి’ హీరోకి కరోనా పాజిటివ్ – భయాందోళనలో టివి కార్మికులు.!!

Posted : June 26, 2020 at 12:53 pm IST by ManaTeluguMovies

కరోనా వైరస్‌ కారణంగా దాదాపుగా మూడు నెలల పాటు షూటింగ్స్‌ జరగలేదు. జూన్ 15 నుంచి అనుమతి రావడంతో టీవీ సీరియల్స్‌ షూటింగ్స్‌ పున: ప్రారంభం అయ్యాయి. దాంతో సీరియల్స్‌ ను హడావుడిగా చిత్రీకరిస్తున్నారు, కానీ ఇప్పుడు ఆ టీవీ ఆర్టిస్టులకు కరోనా వస్తుండడంతో టీవీ ఇండస్ట్రీలో కరోనా కలకలం రోజు రోజుకీ విజృంభిస్తోంది.

రెండు రోజుల క్రితం ‘సూర్యకాంతం’ సీరియల్‌ ఆర్టిస్టు ప్రభాకర్‌కు కరోనా పాజిటివ్‌ నిర్థారణ అవ్వడంతో సభ్యులంతా షాక్ అవ్వడమే కాకుండా షూటింగ్ ఆపేసి, షూట్ లో పాల్గొన్న అందరికీ టెస్టులు చేసి క్వారంటైన్ కి పంపారు. ఇలా జరిగిన కొన్ని సీరియల్స్ వారు షూటింగ్ ఆపలేదు. దాంతో మరో సీరియల్ సెట్లో కరోనా విజృంభించింది.

మా టీవీలో టెలికాస్ట్ అయ్యే ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లో హీరోగా చేస్తున్న హరికృష్ణకి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. 2 రోజుల క్రితం కరోనా వచ్చిన నటుడు ప్రభాకర్ ని కలిసి ఉన్నకారణంగా అనుమానంతో టెస్ట్ చేయించుకున్న హరికృష్ణకి పాజిటివ్ అని తేలింది. దాంతో నేడు జరగాల్సిన గృహలక్ష్మీ షూటింగ్ రద్దయ్యింది. ప్రభాకర్ తో కాంటాక్ట్ అయిన 33 మందికి చేసిన కరోనా టెస్టుల ఫలితాలు రాకుండానే మళ్ళీ షూటింగ్ లు మొదలు పెట్టడంవలనే ఈ తప్పిదం జరిగిందంటున్నారు. టివి సీరియల్ ఇండస్ట్రీలో రోజుకు రోజు పెరుగుతున్న కరోనా కేసుల విషయంలో భయాందోళనకి గురవుతున్న టివి కార్మికులు. ఇంటింటి గృహలక్ష్మీ సీరియల్ కి ఈటీవీ ప్రభాకర్ దర్శక నిర్మాత.


Advertisement

Recent Random Post:

Arvind Kejriwal resigns as Delhi CM, Atishi stakes claim to form Govt

Posted : September 18, 2024 at 1:32 pm IST by ManaTeluguMovies

Arvind Kejriwal resigns as Delhi CM, Atishi stakes claim to form Govt

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad