Advertisement

తరుణ్ ఉద్దేశపూర్వకంగానే మహేష్ ను ట్రోల్ చేశాడా?

Posted : June 30, 2020 at 6:04 pm IST by ManaTeluguMovies

యువ దర్శకుడు తరుణ్ భాస్కర్ మనసులో ఏదున్నా దాన్ని నిర్మొహమాటంగా బయటకు తెలియజేసే వ్యక్తి. దానివల్ల ఎదుటి వారికి ఇబ్బంది ఉందని తెలిసినా జంకడు. అప్పట్లో జనతా గ్యారేజ్ సినిమా గురించి చేసిన వ్యాఖ్యలతో తరుణ్ భాస్కర్ పై ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోపగించుకున్నారు. అయితే ఆ విషయం నెమ్మదిగా సద్దుమణిగింది. ఇప్పుడు రీసెంట్ గా తరుణ్ భాస్కర్ పెట్టిన ఒక పోస్ట్ మహేష్ ఫ్యాన్స్ కు మండేలా చేసింది. తనకు నచ్చిన ఒక సినిమా గురించి పోస్ట్ చేస్తూ మన తెలుగు కమర్షియల్ సినిమాలపై కౌంటర్లు వేసాడు తరుణ్. అయితే ఇందులో మహేష్ కు సెటైర్స్ లా కొన్ని వ్యాఖ్యలు ఉండడంతో మహేష్ ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు.

ఇటీవలే తరుణ్ భాస్కర్ కప్పెల అనే మలయాళ సినిమాను చూసాడు. ఈ సినిమా తనకు తెగ నచ్చేసిందిట. ఇంతవరకూ బాగానే ఉంది వ్యవహారం. అయితే ఈ సినిమాను పొగిడే క్రమంలో హీరో ఈ చిత్రంలో రీ సౌండ్ డైలాగ్ లు చెప్పడు. పంచ్ డైలాగులు పేల్చడు. చివరి పది నిమిషాల్లో రైతుల గురించో, సైనికుల గురించో, దేశం గురించో మెసేజ్ లు ఉండవు. మరి దీన్ని కూడా సినిమా అనే అంటారు మరి ఆ ఊర్లో అని పోస్ట్ చేసాడు తరుణ్.

లాస్ట్ లైన్ ఉద్దేశపూర్వకంగా మహేష్ పై సెటైర్ వేసినట్లే ఉండడంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు ఎక్కడో మండింది. దీంతో సోషల్ మీడియాలో తరుణ్ పై మినీ సైజ్ యుద్ధమే ప్రకటించారు. అయితే తరుణ్ ఈ తరహా ట్రోల్స్ ను పట్టించుకోనని, ఫేక్ ఐడిలతో ముసుగు వేసుకున్న వ్యక్తులు చేసే ట్రోల్స్ తనను ఎఫెక్ట్ చేయవని అనేశాడు తరుణ్.


Advertisement

Recent Random Post:

9 PM | ETV Telugu News | 24th June 2024

Posted : June 24, 2024 at 10:21 pm IST by ManaTeluguMovies

9 PM | ETV Telugu News | 24th June 2024

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement