Advertisement

రామ్ చరణ్ పై వస్తున్న వార్తలన్నీ రూమర్లేనా?

Posted : July 5, 2020 at 8:42 pm IST by ManaTeluguMovies

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ సినిమా చేస్తున్న విషయం తెల్సిందే. ఎన్టీఆర్ కూడా హీరోగా నటిస్తోన్న ఈ సినిమాలో చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రను పోషిస్తున్నాడు. ఇటీవలే చరణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ వీడియోకు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ ప్రస్తుతం వాయిదా పడింది. రిలీజ్ కూడా వచ్చే సంక్రాంతి నుండి వచ్చే జులైకు వాయిదా పడినట్లు వార్తలు వస్తున్నాయి. తిరిగి ఎప్పుడు షూటింగ్ మొదలవుతుందో ఇంకా ఎటువంటి క్లారిటీ లేదు.

ఆర్ ఆర్ ఆర్ కాకుండా రామ్ చరణ్ ఆచార్య సినిమాలో ఒక స్పెషల్ రోల్ లో నటించాల్సి ఉంది. చిరంజీవికి శిష్యుడిగా నక్సలైట్ పాత్రలో చరణ్ కనిపిస్తాడని ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఇకపోతే రామ్ చరణ్ హీరోగా తర్వాతి చిత్రం ఏమిటనే సందేహం అందరిలోనూ ఉంది. గత కొంత కాలం నుండి రామ్ చరణ్ నెక్స్ట్ సినిమా ఈ దర్శకుడితోనే అంటూ పలు రకాల రూమర్లు షికార్లు చేస్తున్నాయి.

కొత్త దర్శకుడితో రామ్ చరణ్ సినిమా ఉంటుందని, కాదు ఉప్పెన దర్శకుడితోనే అని, అది కూడా కాదు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఉంటుందని, ఇలా రకరకాల రూమర్లు షికార్లు చేసాయి. అయితే అవేమీ నిజం కావని తేలిపోయింది. రామ్ చరణ్ ప్రస్తుతం ఇంట్లోనే ఉంటున్నాడని, కేసులు విపరీతంగా వస్తుండడంతో ఎటువంటి రిస్క్ తీసుకునే స్టేజ్ లో లేడని, ప్రస్తుతమున్న ప్రాజెక్టులు పూర్తైన తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి ఆలోచిస్తాడని తెలుస్తోంది.


Advertisement

Recent Random Post:

Sattam En Kayil – Official Teaser | Sathish, Vidhya Pradeep, Mime Gopi | Chachhi | M.S.Jones Rupert

Posted : September 14, 2024 at 8:54 pm IST by ManaTeluguMovies

Sattam En Kayil – Official Teaser | Sathish, Vidhya Pradeep, Mime Gopi | Chachhi | M.S.Jones Rupert

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad