Advertisement

అల్లు వారికి ఆలస్యం.. అమృతమా, విషమా?

Posted : July 6, 2020 at 1:17 pm IST by ManaTeluguMovies

అల్లు అరవింద్ ఒక వైపు వి లాంటి సినిమాల కోసం ముప్పై కోట్లు వెచ్చించడానికి సిద్ధంగా ఉన్నా… చిన్న సినిమాలపై మాత్రం కాస్త కూడా రిస్క్ తీసుకునేందుకు ఇష్టపడడం లేదు. అవసరమైతే మరో ఓటిటి కంపెనీ కొనేసిన సినిమాను లేట్ రిలీజ్ చేయడం కోసం ఆహా తక్కువ అమౌంట్ కోట్ చేస్తోంది.

కృష్ణ అండ్ హిజ్ లీల చిత్రం నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అదే చిత్రం కాస్త ఆలస్యంగా ఆహాలో వచ్చింది. సురేష్ బాబు కోట్ చేసిన మొత్తం కాకుండా ఈ పద్ధతికి అల్లు అరవింద్ అంగీకరించారు. నెట్ ఫ్లిక్స్ లో అసలు హడావిడి లేకుండా విడుదలైన ఈ సినిమాకు ఆహా గట్టి ప్రమోషన్ చేస్తోంది. రెండిటికీ సబ్స్క్రయిబ్ అవని వారు ఈ సినిమా చూసేందుకు ఆహ ప్రిఫర్ చేయవచ్చు. ఎందుకంటే ఆహా ఏడాదికి 365 రూపాయలైతే, నెట్ ఫ్లిక్స్ హెచ్.డి. సబ్స్క్రిప్షన్ నెలకు ఎనిమిది వందల పైచిలుకే. కాకపోతే నెట్ ఫ్లిక్స్ లో ఉన్నంత కంటెంట్ ఆహాలో దొరకదు.

అయితే ఈ లేట్ రిలీజ్ వల్ల ఆహాకు ఎంత లాభమనేది తెలియదు. ఇలా డిజిటల్ రిలీజ్ అయిన సినిమాను లేట్ రిలీజ్ చేయడం అంటే కొత్త యూజర్లను సంపాదించడం కష్టమే. ఎందుకంటే అప్పటికే వేరే చోట రిలీజ్ అయిన సినిమా పైరేట్ అయిపోయి ఫ్రీ డౌన్లోడ్ కి దొరుకుతుంది. బహుశా ఈ సినిమాను ప్రయోగాత్మకంగా ఇలా విడుదల చేసి, వర్కవుట్ అయితే ఈ మోడల్ అనుసరిద్దాం అనేది ప్లాన్ ఏమో!


Advertisement

Recent Random Post: