Advertisement

నిత్యా మీనన్.. నటనను సీరియస్ గా తీసుకోలేదట.!

Posted : July 8, 2020 at 4:00 pm IST by ManaTeluguMovies

సహజ నటి అనగానే మనకు సౌందర్య గుర్తుకువస్తారు. అయితే ఈ కాలంలో ఆమె రేంజ్ లో కాకపోయినా తనదైన శైలిలో సహజనటనతో అందరినీ అలరిస్తోంది నిత్యా మీనన్. అలా మొదలైంది చిత్రంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నిత్యా తర్వాత మరపురాని పాత్రలు ఎన్నో చేసింది. ఇప్పటికీ తన మనసుకు నచ్చే పాత్రలను ఎంపిక చేసుకుంటూ కెరీర్ లో దూసుకుపోతోంది.

ఇటీవలే మీడియాలో ఆమెకు ఒక ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నప్పుడు ఆడిషన్స్ ఇవ్వడం అనేది సర్వ సాధారణం. అయితే ఆడిషన్స్ లో రిజెక్ట్ అయినప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉండేది అని అడిగారు. దానికి నిత్యా మీనన్ అసలు నేను ఆడిషన్స్ ఇస్తేనే కదా, రిజెక్ట్ అవ్వడానికి. నేను ఏనాడూ సినిమాలను కోరుకోలేదు, ఇండస్ట్రీనే నన్ను కావాలనుకుంది.

నాకు మొదటి నుండి సినిమాలపై పెద్ద ఆసక్తి లేదు. నాకు ఎప్పుడూ పెద్ద చదువులు చదువుకుని విదేశాలకు వెళ్లి సెటిల్ అయిపోవాలని ఉండేది. కానీ విధి రాతను ఎవరం మార్చలేం కదా. సినిమా ఇండస్ట్రీ నుండి పిలుపొచ్చింది. నా మనసుకు నచ్చిన పాత్రలను ఎంపిక చేసుకుంటూ హాయిగా సినిమాలు చేసుకుంటున్నాను. అయితే నాలుగేళ్ల నుండి సినిమా కెరీర్ ను చాలా సీరియస్ గా తీసుకుంటున్నాను అని చెప్పింది నిత్యా.


Advertisement

Recent Random Post:

అమ్మ మనసు – Interview with Smt. Konidala Anjanamma Garu

Posted : October 2, 2024 at 8:56 pm IST by ManaTeluguMovies

అమ్మ మనసు – Interview with Smt. Konidala Anjanamma Garu

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad